Horoscope Today: అక్టోబర్ 29 రాశి ఫలాలు... ఈ రాశుల వారు శుభవార్త వింటారు

Horoscope Today 29th October 2020 | 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (అక్టోబర్ 29, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఏ రాశుల వారికి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 29, 2020, 7:00 AM IST
Horoscope Today: అక్టోబర్ 29 రాశి ఫలాలు... ఈ రాశుల వారు శుభవార్త వింటారు
Horoscope Today: అక్టోబర్ 29 రాశి ఫలాలు... ఈ రోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి
  • Share this:
తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (అక్టోబర్ 29, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజంతా ప్రశాంతంగా గడ చిపోతుంది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నహితులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు తేలికగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

వృషభం (క‌ృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఉండొద్దు. విద్యార్థులకు బాగుంది.

మిధునం (మ‌ృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీ ఊహకు భిన్నంగా ఒక చిన్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. చిన్న నాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.కర్ణాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మొక్కు చెల్లించుకుంటారు. ఆదాయం ఒక మోస్తరుగా ఉంటుంది. తలిచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుకు అనుకూంగా ఉంది.
సంత నం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. కుటుంబంతో వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుకు అనుకూంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
విందు వినోదాల మీద ఖర్చు చేస్తారు. ఆదాయం నికడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్త వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. బంధువుకు సంబంధించిన ఒక సమాచరం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు కేసులు నెగ్గవచ్చు.ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

వ‌ృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగ్గించుకుంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుకు అనుకూంగా ఉంది. పెళ్లి బాజాలు మోగుతాయి. ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరఫు బంధువు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో నెగ్గుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యక్రమాలు జరిగే సూచనలున్నాయి. సకాలంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు టీచర్ల
ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పులు తీరుస్తారు. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన
కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం నికడగా ఉంటుంది. ఆరోగ్యం పరవ లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులతో బిజీగా ఉంటారు. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.
Published by: Janardhan V
First published: October 29, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading