Horoscope Today: సెప్టెంబర్ 29 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?

సెప్టెంబర్ 29 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారం (సెప్టెంబర్‌ 29, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • Share this:
  తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారం (సెప్టెంబర్‌ 29, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుగు సాగవచ్చు.

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్‌ విద్యార్థులకు బాగుంది. వృత్తి, ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు జరగవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయతాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికీ తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీ ఎత్తున షాపింగ్‌ చేస్తారు. భార్య పిల్లల్ని సంతోష పెడతారు. మీకు రహస్య శత్రువు తయారవుతారు.

  మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఈ వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నవారికి విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  స్థలం కొనడానికి ప్రయతాలు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి ఉండకపోవచ్చు. కోపతాపాలకు ఇది సమయం కాదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఉద్యోగ ప్రయతాలు ఫలిస్తాయి. వివాహ ప్రయతాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థ పడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి పురోగతి సాధిస్తారు.

  వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.

  ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  అవివాహితులకు వివాహ ప్రయతాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారల మెప్పు పొందుతారు.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఏలిన నాటి శని కారణంగా తిప్పలు ఎక్కువగా ఉన్నాయి, తలచిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది. లాయర్లకు బాగుంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తులు కొనేందుకు ప్రయత్నిస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు.
  Published by:Krishna Kumar N
  First published: