Horoscope 28-7-2021: మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని మైనస్ పాయింట్లూ ఉంటాయి. కొంత మంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు. మరికొందరు రిస్క్ చేయాలంటే వెనకడుగు వేస్తారు. కొంత మంది తెలివి తేటలతో సక్సెస్ అయితే... మరికొంత మంది కష్టాన్నే నమ్ముకొని విజయం సాధిస్తారు. ఈ జరిగే పరిణామాలకూ రాశి ఫలాలకూ సంబంధం ఉందంటారు జ్యోతిష పండితులు. సూర్యగమనం, గ్రహ బలాలు, తిథులు, నక్షత్రాలు, కాలం, వర్జ్యం ఇలా ఎన్నో అంశాలు మనపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. చాలావరకు సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.
మిథున రాశి (Gemini)
ఈ రాశి వారు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హిస్తారు. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ 5 రాశుల వారికి డబ్బు కొరత ఉండదు...
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులను ఓపికగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కన్య రాశి (Virgo)
ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం చేతికి వస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రుణదాతల ఒత్తిడి ఉంటుంది.
తుల రాశి (Libra)
ఈ రాశి వారికి అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో చక్కగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం ప ట్ల జాగ్రత్త.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు ఉత్సాహవంతులు.. లైఫంటే వీరిదే!
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. ఆరోగ్యం పరవాలేదు.
ధనస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారు తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం సొంతమవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. వ్యాపారులకు బాగుంటుంది.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. ఆర్థికంగా బాగా ఒత్తిడికి గురవుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంస లు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పని ఒత్తి డి ఉంటుంది.
మీన రాశి (Pisces)
ఈ రాశి వారికి సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో కొద్దిగా లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign