HOME »NEWS »PROPHECY »horoscope today 28 january 2021 raasi phalalu astrology predictions in telugu sk 2

Horoscope Today: జనవరి 28 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి జాబ్ ఆఫర్ గ్యారంటీ

Horoscope Today: జనవరి 28 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి జాబ్ ఆఫర్ గ్యారంటీ
ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (జనవరి 28, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (జనవరి 28, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)



    ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు అధ్యాపకులకు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    శుభకార్యాలు తలపెడతారు. సప్తమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అవివాహితుకు పెళ్లి గంట మోగే సూచనున్నాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో కంపెనీ నుంచి అనుకూల సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనకు దిగవద్దు.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ఆస్తి కొనుగోలు విషయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. షాపింగ్‌ చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. సమీప బంధువుకు సంబంధించి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

    ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బంధుమిత్రులు సహాయ పడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. దాచుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఐటీ వారికి బాగుంది.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి ఉన్నవారితో పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాకు వెళతారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. డబ్బు నష్టం జరుగుతుంది.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    వివాహ సంబంధాలు కుదిరే అవకాశముంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరఫు బంధువులు ఇంటికి వచ్చే సూచనునలున్నాయి. ప్రయాణ సూచనలున్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 )

    శుభ కార్యాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

    ఈ రోజు గ్రహస్థితి అన్నివిధాలా అనుకూంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువు, స్నేహితులుపకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:January 28, 2021, 07:55 IST