• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 28 4 2021 TODAY ASTROLOGY LOGICS SHOW GOOD NEWS IN JOBS AND MARRIAGES CHECK YOUR ZODIAC SIGNS HERE NK

Horoscope today 28-4-2021: ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే ఛాన్స్

Horoscope today 28-4-2021: ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే ఛాన్స్

Horoscope today 28-4-2021: రాశిఫలాలు (image credit - shutter stock)

Horoscope today 28-4-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ప్రత్యేకతలు చెప్పారో తెలుసుకుందాం. మన రాశి సంగతి తేల్చేసుకుందాం.

  • Share this:
    Horoscope today on 28-4-2021: రాశిఫలాలకు మరో రోజు వచ్చేసింది. మరి ఇవాళ 12 రాశుల్లో ఎవరికి బాగా కలిసొస్తుంది అనేది ఆసక్తికరం. అలాగే ఆర్థిక విషయాల్లో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అంతేకాదు.. ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలపై విశ్లేషించుకుందాం. ఉద్యోగాలు, విదేశీ శుభవార్తలు, ఆరోగ్యం, మనస్పర్థలు, కుటుంబ విషయాలు ఇలా అన్ని అంశాలపై ఇవాళ రాశిఫలాల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, కాలం, గ్రహాలు ఇలా అన్నీ లెక్కలేసుకొని ఇవి చెబుతున్నారు కాబట్టి... వారు చెప్పింది చదివి... అప్రమత్తం అయితే మంచిదే. ఆలస్యం లేకుండా ఇక తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు ప్రయత్నాలను చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. సహచరులు, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తలపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హామీలు ఉండవద్దు.

    కర్కాటక రాశి (Cancer)
    ఈ రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

    సింహ రాశి (Leo)
    పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    కన్య రాశి (Virgo)
    వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    తుల రాశి (Libra)
    ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నష్టపోతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం మంచిది.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభకార్యం తలపెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు జాగ్రత్త.

    మకర రాశి (Capricorn)
    ఏలిన నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వివాహ సంబంధం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి.

    కుంభ రాశి (Aquarius)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఇతరులకు బాగా సహాయం చేస్తారు.

    ఇది కూడా చదవండి: Viral: కరోనా కాదు ఈ ఫ్యాన్ బయపెడుతోంది.. వీడియో చూసి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

    మీన రాశి (Pisces)
    మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్‌ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో
    సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి.
    Published by:Krishna Kumar N
    First published: