Horoscope Today: నేటి రాశి ఫలాలు..ఈ రాశుల వారు ఖర్చులు తగ్గించాలి.. లేదంటే ఇబ్బందులు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope Today: నేడు శుక్రవారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు? జ్యోతిష పండితులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఈ వివరాలను మేషం నుంచి మీనం వరకు.. రాశుల వారీగా ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    నేడు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ నేరవేరుతాయి. ఉద్యోగంలో కూడా అంతా సానుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశముంది. మరికొందరికి మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఖర్చులు తగ్గించుకోవాలని కొందరికి జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. మరి ఏ రాశుల వారికి ఇలా ఉందో ఇక్కడ చూద్దాం.

    మేష రాశి (Aries)
    నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభ రాశి (Taurus)
    అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మంచి చోట వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులొకరు మీ సహాయం తీసుకుంటారు. కొత్త వారు పరిచయమవుతారు. ప్రేమ సంబంధమే ఖాయమయ్యే సూచనలున్నాయి. వ్యాపారులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది.

    Zodiac Signs: ఈ 4 రాశులవారు కష్టజీవులు. విజయాలు సాధిస్తారు

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి తగ్గుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగంలో, అధికారులు, సద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదాలకు దిగకండి. త్వరలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. మీ స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మీ కోరికొకటి నెరవేరుతుంది.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగంలో పని ఒత్తిడి, వేధింపులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు లాభాలార్జిస్తారు.

    Chinese Kali Temple: కోల్‌కతాలో కాళీ మాత ఆలయం.. అక్కడ నూడుల్సే నైవేద్యం

    తుల రాశి (Libra)
    నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. హామీలు కూడా ఇవ్వవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహెూద్యోగుల నుంచి సహకారం అందుతుంది. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    Zodiac Signs: మార్పుల్ని స్వాగతించే 4 రాశులు.. ఈ లక్షణంతో విజయాలు

    మకర రాశి (Capricorn)
    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ లభించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

    కుంభ రాశి (Aquarius)
    ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సాఫీగానే సాగిపోతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనలకు దిగవద్దు.

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల వారికి కాలం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: