Home /News /astrology /

Horoscope 27-7-2021: రాశి ఫలాలు.. నేడు మంచి ఫలితాలు... పనుల్లో కొంత ఒత్తిడి

Horoscope 27-7-2021: రాశి ఫలాలు.. నేడు మంచి ఫలితాలు... పనుల్లో కొంత ఒత్తిడి

Horoscope 27-7-2021: రాశి ఫలాలు

Horoscope 27-7-2021: రాశి ఫలాలు

Horoscope today 27-7-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందని జ్యోతిష పండితులు చెప్పారో... ఫటాఫట్ తెలుసుకుందాం.

  Horoscope today on 27-7-2021: రాశిఫలాలకు మరో రోజు గడిచింది. గ్రహాలు తమదైన కక్ష్యలో ముందుకుసాగాయి. కాలం పరుగులు పెడుతోంది. మధ్యలో కరోనా కష్టాల సవాళ్లు విసురుతోంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో... డబ్బు అత్యంత కీలకమైనది. ఏం చెయ్యాలన్నా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. మరి జ్యోతిష పండితులు ఇవాళ మన రాశిఫలాలను ఎలా డిసైడ్ చేశారు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరు అప్రమత్తంగా ఉండాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి... అన్ని విషయాలనూ చకచకా తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.

  వృషభ రాశి (Taurus)
  ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కు వీలుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు సహాయం చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

  మిథున రాశి (Gemini)
  ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం.

  ఇది కూడా చదవండి: Zodiac signs: మంగళవారం పుడితే... ఈ పనులు చెయ్యొద్దు

  కర్కాటక రాశి (Cancer)
  ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో మంచి కం పెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

  సింహ రాశి (Leo)
  ఈ రాశి వారు గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. వ్యక్తిగతంగా ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

  కన్య రాశి (Virgo)
  ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

  తుల రాశి (Libra)
  ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరవాలేదు.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఈ రాశి వారికి ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఈ రాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు

  మకర రాశి (Capricorn)
  ఈ రాశి వారి కాలం ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించినా పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఖర్చులకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  కుంభ రాశి (Aquarius)
  ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగు పడుతుంది.

  మీన రాశి (Pisces)
  ఈ రాశి వారికి ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిత్రులకు చేసే సహాయం వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచనలున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు