• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 27 4 2021 ASTROLOGY SUGGEST THESE ZODIAC SIGNS CONCENTRATE ON HEALTH BROWSE YOUR RASI PHALALU HERE NK

Horoscope today 27-4-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆరోగ్యం జాగ్రత్త

Horoscope today 27-4-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆరోగ్యం జాగ్రత్త

Horoscope today 27-4-2021: నేటి రాశి ఫలాలు (image credit - shutter stock)

Horoscope today 27-4-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందని జ్యోతిష పండితులు చెప్పారో... ఫటాఫట్ తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today on 27-4-2021: రాశిఫలాలకు మరో రోజు గడిచింది. గ్రహాలు తమదైన కక్ష్యలో ముందుకుసాగాయి. కాలం పరుగులు పెడుతోంది. మధ్యలో కరోనా కష్టాల సవాళ్లు విసురుతోంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో... డబ్బు అత్యంత కీలకమైనది. మందుల నుంచి ఆక్సిజన్ వరకూ అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. మరి జ్యోతిష పండితులు ఇవాళ మన రాశిఫలాలను ఎలా డిసైడ్ చేశారు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరు అప్రమత్తంగా ఉండాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి... అన్ని విషయాలనూ చకచకా తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. అష్టమ శని కారణంగా తరచూ అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. కొద్దిగా విశ్రాంతి అవసరం.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు
    వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

    కన్య రాశి (Virgo)
    ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.

    తుల రాశి (Libra)
    ఉద్యోగంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. ఆరోగ్యం పరవాలేదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. అదృష్ట యోగం పట్టబోతోంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు క్రమంగా పూర్తవుతాయి.

    మకర రాశి (Capricorn)
    ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధలకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువును ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

    కుంభ రాశి (Aquarius)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఎవరి విమర్శలూ పట్టించుకోవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

    ఇది కూడా చదవండి: Fenugreek Health Benefits: మెంతులతో ఆయుర్వేద చిట్కాలు.. తెలుసుకుంటే ఆరోగ్యమే

    మీన రాశి (Pisces)
    తలచిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.
    Published by:Krishna Kumar N
    First published: