Horoscope 26-7-2021: ఈ రాశుల వారికి వ్యాపార వృద్ధి.. వారికి ఉద్యోగాల్లో తీపికబురు

Horoscope 26-7-2021: నేటి రాశి ఫలాలు

Horoscope today 26-7-2021: రాశి ఫలాలు మన రోజువారీ జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. గ్రహబలాలు ఎలా ఉన్నాయో, ఏ రాశి వారికి ఎలాంటి శుభ సంకేతాలు ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    Horoscope today 26-7-2021: రాశి ఫలాలకు సంబంధించి... గ్రహాల ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రధానంగా శనిగ్రహం, గురుగ్రహం ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికి మానవ సంబంధాలు మెరుగవుతూ... ప్రేమ, పెళ్లి సంబంధాల వంటివి కుదురుతున్నాయి. మరికొన్ని రాశుల వారికి ఉన్న సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయి. ఆవేశంలో అనే మాటలు అవతలి వారికి తీవ్ర మనోవేదన కలిగిస్తాయి. అందువల్ల మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకొని అప్రమత్తం అవుదాం.

    మేష రాశి (Aries)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభ రాశి (Taurus)
    ఈ రాశివారికి ఆర్థిక, రాజకీయ రంగాల వారికి బాగుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలోను, వ్యాపారంలోను మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఒక గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    మిథున రాశి (Gemini)
    ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది. ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు పట్టించుకోండి.

    కర్కాటక రాశి (Cancer)
    ఈ రాశి వారు ఈ రోజంతా గట్టి పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    సింహ రాశి (Leo)
    ఈ రాశి వారికి ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు.

    కన్య రాశి (Virgo)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉన్నా మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి చేతి నిండా పని ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    తుల రాశి (Libra)
    ఈ రాశి వారు మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల పరంగా లాభాలున్నాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో కొన్నిటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుదలగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సన్నిహితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు వింటారు. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశి వారికి ఏ మ్యూజిక్ నచ్చుతుంది?

    మకర రాశి (Capricorn)
    ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరితగతిన విజయాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    కుంభ రాశి (Aquarius)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

    మీన రాశి (Pisces)
    ఈ రాశి వారికి గ్రహ స్థితి బాగా అనుకూలంగా ఉంది. కొన్ని కోరికలు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: