• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 26 4 2021 LATEST ASTROLOGY SHOW THESE ZODIAC SIGN PEOPLE MUST CONCENTRATE ON KEY WORKS CHECK YOUR RASI PHALALU TODAY NK

Horoscope today 26-4-2021: నేటి రాశి ఫలాలు.. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ వహించాలి

Horoscope today 26-4-2021: నేటి రాశి ఫలాలు.. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ వహించాలి

Horoscope today 26-4-2021: నేటి రాశి ఫలాలు

Horoscope today 26-4-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఆర్థిక ఫలాలు ఎవరికి దక్కుతాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today on 26-4-2021: రాశి ఫలాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఒక్కో రోజున కొన్ని రాశుల వారికి కలిసొస్తుంటే... మరికొందరికి సమస్యలు ఉంటున్నాయి. రాశిఫలాలు తెలుసుకోవడం ద్వారా... ఆ రోజు జరగబోయే, ఎదురవ్వబోయే సమస్యలపై ముందుగానే అలర్ట్ అవ్వొచ్చు. సపోజ్ హామీలు ఉండొద్దు అని పండితులు చెబితే... ఉండకపోవడమే మేలు. ఆర్థిక వ్యవహారాలు చేయవద్దు అని చెబితే... ఆ రోజుకు వాటిని ఆపేయడమే మంచిది. గ్రహాలు, తిథులు, కాలం, నక్షత్రాలు అన్నీ లెక్కలోకి తీసుకొని నేడు జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు చెబుతున్నారో చూద్దాం.

    మేష రాశి (Aries)
    మంచి కాలం నడుస్తోంది. పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో స్థిరమైన జీవితం లభిస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు.

    వృషభ రాశి (Taurus)
    ఆశించిన స్థాయిలో కాలం సహకరించకపోవచ్చు. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో అధికారుల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ నుంచి ఆర్థిక సహాయం అందుకున్నవారు ముఖం చాటేస్తారు. మీ ప్రయత్నాలు త్వరలో సత్ఫలితాలను ఇస్తాయి.

    మిథున రాశి (Gemini)
    ఒక పథకం ప్రకారం పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని మంచి పనులు చేసి మెప్పుపొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు చవిచూస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆవేశకావేషాలను
    అదుపులో ఉంచుకోండి. ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    కర్కాటక రాశి (Cancer)
    ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారుల ద్వారా ఉద్యోగంలో ప్రయోజనం పొందుతారు. అందరికీ ఉపకరించే పనులు చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త
    అవసరం. మీ పనులకు ఇతరుల మీద ఆధారపడవద్దు. హామీలు ఉండవద్దు.

    సింహ రాశి (Leo)
    శుభవార్త వింటారు. మంచి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి రాకపోవచ్చు. ఒక కుటుంబ సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    కన్య రాశి (Virgo)
    ఆటంకాలు ఉన్నా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో బాధ్యత మీద శ్రద్ధ పెట్టండి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కొంత పరీక్షా కాలం లాగా కనిపిస్తుంది. ఓర్పు, సహనం అవసరం.

    తుల రాశి (Libra)
    ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ చాలా అవసరం. మీ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగ, వ్యాపారాలు బాగున్నాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక లాభం ఉంది. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ సమస్యలు, కుటుంబ ప్రయోజనాల మీద దృష్టి పెడతారు. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ధనలాభం ఉంది. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు. కుటుంబపరంగా శుభవార్త వింటారు. ఆదాయం పెరిగి, రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సా్హం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    మకర రాశి (Capricorn)
    అదృష్ట యోగం ఉంది. తలచిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేష ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు మీద పడతాయి. సంతానం ద్వారా శుభవార్త వింటారు. కొందరు మిత్రులు శత్రువులుగా మారి, విఘ్నాలు సృష్టిస్తారు.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ అధికమైనప్పటికీ సత్ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రయత్నాలు, నిర్ణయాలు ప్రయోజనం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

    ఇది కూడా చదవండి: Corona Positive: కరోనా వచ్చినా... ఈ లక్షణాలు మాత్రమే ఉంటే ఆస్పత్రికి వెళ్లక్కర్లేదు

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది కానీ చివరికి శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్‌ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పది మందికీ మేలు జరిగే పనులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు