Horoscope 25-11-2020: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు బుధవారం (నవంబర్ 25, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
మిలిటరీ, పోలీస్, అగ్నిమాపక దళం వంటి వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇతర రంగాలకు చెందినవారికి వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికేమీ ఢోకా ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు అవుతుంది.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
బ్యాంకు, ఆర్థిక రంగానికి చెందినవారు, వడ్డీ వ్యాపారులకు సమయం బాగుంది. ఆదాయం పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితురాలి మీద వరాల వర్షం కురిపిస్తారు. విద్యార్థులకు పరవాలేదు.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
టెక్నికల్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలవారికి చాలా బాగుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
డాక్టర్లకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు, జల విద్యుత్ రంగావారికి సమయం బాగుంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. సప్తమ శని కారణంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలవారికి, న్యాయవ్యవస్థలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ప్రభుత్వ ఉద్యోగాలలోనివారికి, జర్నలిస్టులకు, లేఖకులకు సమయం బాగుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వ్యాపార, న్యాయవ్యవస్థ, స్వయం ఉపాధి రంగాల వారికి బాగుంది. ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేసుకోండి.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
వృత్తి నిపుణులు, డాక్టర్లు, వైద్య రంగానికి చెందినవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దూరపు బంధువు కుటుంబంతో వియ్యం పొందే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. విద్యార్థులకు పరవాలేదు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
క్రీడాకారులు, టెక్నాలజీ నిపుణులు, పరిశోధకులకు సమయం బాగుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
లాయర్లకు, విద్యుత్ రంగానికి చెందినవారికి, అధ్యాపకులకు చాలా బాగుంది. మిగిలిన రంగాలకు చెందినవారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. శివార్చన మంచిది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, కోళ్ల పెంపకం వంటి రంగాల వారికి సమయం చాలా బాగుంది. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా, ఉల్లాసంగా షికారు చేస్తారు.
మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
కళా సాహిత్య, ఆధ్యాత్మిక రంగాలలోని వారికి, మేధావులకు సమయం బాగుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయానికేమీ ఢోకా లేదు. విదేశాలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు చాలా బాగుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు.