Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశులవారికి అనేక అవరోధాలు..

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు(24 సెప్టెంబర్) చాలా రాశుల వారికి భేషుగ్గా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. పలు రాశుల వారికి నేడు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి.

  • Share this:
    Horoscope today: నేడు(24 సెప్టెంబర్) చాలా రాశుల వారికి భేషుగ్గా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. పలు రాశుల వారికి నేడు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు రావచ్చు. మరికొందరు ఖర్చుకు కళ్లెం వేయాల్సిన సమయం వచ్చింది. అసలు ఎవరికి ఎలా ఉందో పూర్తి దినఫలాలను ఇక్కడ చూద్దాం.

    మేష రాశి (Aries): మంచి కాలం నడుస్తోంది. విజయాలు, సాఫల్యాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో ఆదాయం పెంచుకుంటారు.

    వృషభ రాశి (Taurus): ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో సహోద్యోగులు అవరోధాలు సృష్టించే అవకాశముంది. ధనలాభ సూచనలున్నాయి. కుటుంబ విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల ఊహించని మేలు జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు.

    మిథున రాశి (Gemini): అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇది మంచి సమయం. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ మున్ముందు కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శమ ఎక్కువవుతుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. సమీప బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer): కొద్ది కాలంపాటు ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అనేక అవరోధాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. బంధువుల్లో మిమ్మల్ని అవమానించే వారుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తి నిపుణులకు శ్రమ తప్పదు.

    సింహ రాశి (Leo): సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిమారమవుతాయి. అధికారం చేపట్టై అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ది చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.

    కన్య రాశి (Virgo): సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. అనేక విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. శత్రుపీడ తొలగుతుంది. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది.

    తుల రాశి (Libra): అనుకున్న పనులు పూర్తవుతాయి. ఎటు చూసినా విజయాలే గోచరిస్తున్నాయి. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించినంతగా అదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రేమ ఫలిస్తుంది.

    వృశ్చిక రాశి (Scorpio): తల పెట్టిన పనులు సఫలమవుతాయి. ఇది ఆదాయపరంగా కలిసొచ్చే కాలం. అందువల్ల మేలైన భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి అభినందనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.

    ధనస్సు రాశి (Sagittarius): కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలను ఇస్తాయి. రోజంతా అనందోత్సాహాలతో గడుపుతారు. మిత్రులు, స్నేహితురాలి ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది.

    మకర రాశి (Capricorn): మనసులోని కోరికలు నెరవేరతాయి. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. లాభాల కోసంవ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది.

    కుంభ రాశి (Aquarius): ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపారపరంగాజాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్వల్ప ఆనారోగ్యం సంభవం.

    మీనం (Pisces): ఆత్మస్థయిర్యంతో వ్యవహరిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
    Published by:Sumanth Kanukula
    First published: