Horoscope 24-5-2021: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శ్రమతో మంచి ఫలితాలు

Horoscope 24-5-2021: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శ్రమతో మంచి ఫలితాలు

Horoscope today 24-5-2021: నేటి రాశి ఫలాల్లో ఎలాంటి శుభ సూచికలు ఉన్నాయి... వివాహాలు ఏ రాశుల వారికి కుదిరే అవకాశాలు ఉన్నాయి... ఉద్యోగాలు ఎవరికి వస్తాయి... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope 24-5-2021: మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని మైనస్ పాయింట్లూ ఉంటాయి. కొంత మంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు. మరికొందరు రిస్క్ చేయాలంటే వెనకడుగు వేస్తారు. కొంత మంది తెలివి తేటలతో సక్సెస్ అయితే... మరికొంత మంది కష్టాన్నే నమ్ముకొని విజయం సాధిస్తారు. ఈ జరిగే పరిణామాలకూ రాశి ఫలాలకూ సంబంధం ఉందంటారు జ్యోతిష పండితులు. సూర్యగమనం, గ్రహ బలాలు, తిథులు, నక్షత్రాలు, కాలం, వర్జ్యం ఇలా ఎన్నో అంశాలు మనపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

  వృషభ రాశి (Taurus)
  తలచిన పనులు త్వరగానే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  మిథున రాశి (Gemini)
  ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

  కర్కాటక రాశి (Cancer)
  ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవా లేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఒక కీలకమైన కుటుంబ
  సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.

  సింహ రాశి (Leo)
  ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  కన్య రాశి (Virgo)
  కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవా లేదు.

  తుల రాశి (Libra)
  ధన లాభానికి అవకాశం ఉంది. శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులను సంప్రదిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్త వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  మకర రాశి (Capricorn)
  ఉద్యోగంలో మంచి స్థితి కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్ద సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి అవసరం.

  కుంభ రాశి (Aquarius)
  పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవా లేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

  ఇది కూడా చదవండి: New vaccine: ఇండియాలో మరో కరోనా వ్యాక్సిన్ తయారీ... మోస్ట్ పవర్‌ఫుల్

  మీన రాశి (Pisces)
  ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.
  Published by:Krishna Kumar N
  First published: