Horoscope: ఈ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి. ఆ రాశుల వారికి మంచికాలం

Horoscope today: నేటి రాశి ఫలాలు

Horoscope today 24-7-2021: నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి... ఏ రాశుల వారికి నేడు బాగా కలిసొస్తుంది... ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి... జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు?

  • Share this:
    Horoscope today on 24-7-2021: ఇండియా ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడుతోంది. వ్యాపారాలు తిరిగి పుంజుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు గట్టెక్కుతున్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. ధర్డ్ వేవ్ రాదని చెప్పలేం. ఇలాంటి సమయంలో మనల్ని అప్రమత్తం చెయ్యడానికి రాశి ఫలాలు ఉపయోగపడతాయి. ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటే... రాశి ఫలాల ద్వారా ముందుగానే తెలుసుకొని అప్రమత్తం అవ్వొచ్చు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తల పెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు.

    వృషభ రాశి (Taurus)
    ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

    ఇది కూడా చదవండి:Vastu tips: ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే...

    మిథున రాశి (Gemini)
    బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. ఎంతో పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకూ నెరవేరుతాయి.

    కర్కాటక రాశి (Cancer)
    చాలావరకు మంచి కాలం నడుస్తోంది. తల పెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

    సింహ రాశి (Leo)
    ఇంటా బయటా సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

    తుల రాశి (Libra)
    ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి.

    ఇది కూడా చదవండి: Clock Vastu: వాల్‌క్లాక్‌ను అక్కడ ఉంచితే అదృష్టం… శుభకాలం

    వృశ్చిక రాశి (Scorpio)
    ఇంటా బయటా సమస్యలున్నా ముందుకు దూసుకు వెడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తల పెట్టిన పనులు విజయాన్నిస్తాయి.

    ధనస్సు రాశి (Sagittarius)
    తేలికగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఆరోగ్యానికి ఏమాత్రం ధోకా లేదు.

    మకర రాశి (Capricorn)
    ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    కుంభ రాశి (Aquarius)
    అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

    మీన రాశి (Pisces)
    పెళ్లిపరంగా శుభవార్తలు వింటారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
    Published by:Krishna Kumar N
    First published: