• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 24 4 2021 ACCORDING TO ASTROLOGY THESE ZODIAC SIGNS MAY GET GOOD NEWS ABOUT CHILDBIRTH TODAY SCAN YOUR RASI PHALALU HERE NK

Horoscope today: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి సంతాన శుభవార్తలు

Horoscope today: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి సంతాన శుభవార్తలు

Horoscope today: నేటి రాశి ఫలాలు

Horoscope today 24-4-2021: నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి... ఏ రాశుల వారికి నేడు బాగా కలిసొస్తుంది... ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి... తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today on 24-4-2021: దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేని సమయం. కరోనా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న రోజులు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. ఇలాంటి సమయంలో మనల్ని అప్రమత్తం చెయ్యడానికి రాశి ఫలాలు ఉపయోగపడతాయి. ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటే... రాశి ఫలాల ద్వారా ముందుగానే తెలుసుకొని అప్రమత్తం అవ్వొచ్చు. పెళ్లిళ్లు, శుభకార్యాల విశేషాలు తెలుసుకోవచ్చు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

    వృషభ రాశి (Taurus)
    మితిమీరిన ఖర్చుకు కళ్లెం వేయాలి. ఆదాయం పరవా లేదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కాస్తంత పరవాలేదు. కోర్టు కేసుల్లో చిక్కు ఎదురవుతాయి.

    మిథున రాశి (Gemini)
    దగ్గరవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.

    కర్కాటక రాశి (Cancer)
    సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

    సింహ రాశి (Leo)
    పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవా లేదు. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    కన్య రాశి (Virgo)
    విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

    తుల రాశి (Libra)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశా నుంచి ఆఫర్‌ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు అర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ముందంజ వేస్తారు.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమికురాలి మీద ఖర్చు పెరుగుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

    కుంభ రాశి (Aquarius)
    సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. వృత్తి ఉద్యోగాలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, స్వయం ఉపాధి వారికి చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.

    ఇది కూడా చదవండి: Vastu - 7 Plants: ఇంట్లో ఈ 7 మొక్కలు ఉంటే... అదృష్టం, సంపద మీదే...

    మీన రాశి (Pisces)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: