Horoscope Today: అక్టోబరు 23 రాశి ఫలాలు.. బంధువులతో విభేదాలు.. ఈ రాశుల వారికి కష్టాలు

Horoscope: రాశి ఫలాలు

Horoscope today: నేడు శనివారం. ప్రతి రోజు జ్యోతిష పండితులు దినఫలాలు చెబుతారు. తిథి, నక్షత్రం, గ్రహాల కదలిక ఆధారంగా వారి భవిష్యత్‌ను కొంత వరకు అంచనా వేస్తారు. మరి వారి అంచనాల మేరకు నేడు ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 • Share this:
  కాలజ్ఞానం

  అక్టోబరు 23, 2021

  దిన ఫలాలు

  మేష రాశి (Aries):
  ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు మాత్రం బాగా తగ్గించుకోవాలి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికారు చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

  వృషభ రాశి (Taurus):
  ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

  మిథున రాశి (Gemini):
  మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆదాయం పరవాలేదు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కాస్తంత పరవాలేదు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి.

  వంటగదిలో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే..!

  కర్కాటక రాశి (Cancer):
  దగ్గరవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్ధులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. పేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.

  సింహ రాశి (Leo):
  సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉ౦టుంది. విద్యార్ధులకు అన్నివిధాలా మెరుగ్గా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

  కన్య రాశి (Virgo):
  పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  పూజగదిని ఇలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

  తుల రాశి (Libra):
  విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసు అనుకూలం అవుతుంది.

  వృశ్చిక రాశి (Scorpio):
  అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు చాలా బాగు౦టుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  విష్ణుమూర్తికి ఇష్టమైన కార్తీకమాసం.. ప్రాముఖ్యత!

  ధనస్సు రాశి (Sagittarius):
  తల పెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణ సమన్య నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి మంచి సమాచారం అందుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్‌ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగుంది.

  మకర రాశి (Capricorn):
  ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభాలార్జిస్తారు. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి.పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా శమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

  మీ జాతకంలో కేతువు ఈ స్థానంలో ఉంటే.. విదేశీయానం...!

  కుంభ రాశి (Aquarius):
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమికురాలి మీద ఖర్చు పెరుగుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

  మీన రాశి (Pisces):
  సొంత ఊళ్లోనే ఉద్యోగానికి మంచి ఆఫర్‌ వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, స్వయం ఉపాధివారికి చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: