నేడు శనివారం. వివిధ రాశుల వారికి శుభకరంగా ఉండనుంది. చాలామంది ఒత్తిడిని జయిస్తారు. అయితే కొన్ని రాశుల వారు తాము తీసుకునే నిర్ణయాల పట్ల ధృడంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా మేషం నుంచి మీన రాశి వరకు.. జనవరి 22, శనివారం నాడు ఎవరికి ఎలా గడుస్తుందో దిన ఫలాల్లో తెలుసుకుందాం.
* మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
చాలా రోజులుగా ఉన్న అశాంతి నుంచి కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఓ కొత్త పని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. ఈ రోజు చివరి వరకు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ముగించేయండి.
లక్కీ సైన్- ఇష్టమైన పాత దుస్తులు
* వృషభం (Taurus): ఏప్రిల్ 20-మే20
మీ మైండ్‌లో ఉన్న ఓ ఆలోచనపై మీకో మంచి ఆఫర్ వస్తుంది. అందరిలో భావోద్వేగానికి గురికాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. కొంతమందికి గతంలో ఉన్న అడ్డంకులు నేడు తొలగిపోవచ్చు.
* మిథునరాశి (Gemini): మే 21- జూన్ 21
రాబోయే కొద్ది నెలల్లో ఒక సరికొత్త ఆలోచన వాస్తవరూపం దాలుస్తుంది. ఏకాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
లక్కీ సైన్- ఫర్నిచర్
* కర్కాటకం(Cancer): జూన్ 22- జూలై 22
పై నుంచి వచ్చే సూక్ష్మ సంకేతాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే మీ నిర్ణయాన్ని దృఢంగా ఉంచుకోండి. మీ పురుష స్నేహితుడు ఓ ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చు.
లక్కీ సైన్- రంగురంగుల గులకరాళ్లు
* సింహం(Leo): జులై 23- ఆగస్టు 22
జీవితం సాధారణంగా అనిపిస్తుంది. కానీ క్రమంగా జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తారు. నేటి మీ సంభాషణల పట్ల జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీకు అప్పగించే పని పట్ల మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
* కన్య (Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22
మీరు పైకి నిర్మలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ లోపల అపార ఆలోచనలను కలిగి ఉంటున్నారు. మీరు సాధించే విజయం చిన్నదైనప్పటికీ అది మీకు ముఖ్యమైనదే. ఉత్తమ ఫలితాల కోసం మరింత నిబద్ధతతో పనిచేయండి. త్వరలో కారులో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లబోతున్నారు.
లక్కీ సైన్- ఒక కప్పు గ్రీన్ టీ
* తుల (Libra): సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
గతంలో నేర్చుకుని వదిలివేసిన విషయాలను మళ్లీ సాధన చేయాల్సి రావచ్చు. ఇక ఓ విషయంపై మీరు త్వరలోనే క్లారిటీ ఇస్తారని మీ కుటుంబం ఎదురుచూస్తుంది.
* వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
కొన్ని కొత్త పరిణామాలతో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉండొచ్చు. వ్యవహారాలన్నీ చక్కబడేవరకు కొంత సమయం కేటాయించండి. సన్నిహిత స్నేహితుడి నుంచి వచ్చే పిలుపు మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. కొన్ని సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు.
లక్కీ సైన్- ఒక టూల్ కిట్
* ధనుస్సు (Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
సరికొత్త అధ్యయనాలు ఈరోజు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవలే మీరు కలుసుకున్న ఓ వ్యక్తితో కొన్ని కొత్త భావాలను ఏర్పరచుకుంటారు. చేతిలో డబ్బు బాగానే ఉంటుంది.
లక్కీ సైన్- వాలెట్
* మకరం (Capricorn): డిసెంబర్ 22 - జనవరి 19
మీ అర్హతలతో సరిపోలే పనిలో కుదురుకునే అవకాశం ఉంది. మీరు పోగొట్టుకున్న ముఖ్యమైన వ్యక్తి లేదా డాక్యుమెంట్ గురించి పాజిటివ్ న్యూస్ వింటారు. ఔటింగ్‌కు వెళ్లడం, బ్రేక్ తీసుకోవడం చేస్తే బెటర్.
లక్కీ సైన్ - రాగి గిన్నె
* కుంభం (Aquarius): జనవరి 20- ఫిబ్రవరి 18 క్రీడా కార్యకలాపాలకు ఆకర్షితులవుతారు. కొత్తవారిని కలవడానికి ఇది మంచి రోజు. వైద్య అవసరాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈరోజు వచ్చే ఓ ఫోన్ కాల్ మీ ప్రణాళికలను మార్చవచ్చు.
* మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
ఇతరులు సృష్టించే ఆశ్చర్యకర కార్యక్రమాలను అభినందించే స్థితిలో ఉండకపోవచ్చు. మీ పాత స్నేహం చివరి దశకు చేరుకోవచ్చు. ఏదైనా సందేహం ఉంటే మీకు మార్గనిర్దేశం చేసే వ్యక్తిని సంప్రదించండి.
లక్కీ సైన్- అస్పష్టంగా కనిపించే ఆకాశం
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.