Horoscope Today 22nd September: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం

ప్రతీకాత్మక చిత్రం

గ్రహాల కదలిక, నక్షత్రం, తిథి వంటి అంశాల ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను అందిస్తారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

 • Share this:
  Horoscope Today: ఈ రోజు(బుధవారం) ఏదైనా శుభకార్యాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా?.. అయితే ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి. ఎలాంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రహాల కదలిక, నక్షత్రం, తిథి వంటి అంశాల ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను అందిస్తారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  మేషం (Aries అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం నిలకడగా ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  వృషభం (Taurus కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోండి. స్నేహితుల సహాయంతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హెూదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.

  మిథునం (Gemini మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఇరుగు పొరుగుతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

  కర్కాటకం (Cancer పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంతా మీరనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  సింహం (Leo మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

  కన్య (Virgo ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) పట్టిందల్లా బంగారమవుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలచిన పనులు చాలావ రకు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారుల లాభార్జన నిలకడగా కొనసాగుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందడుగువేస్తాయి.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

  వృశ్చికం (Scorpio విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) వ్యాపారులకు నిలకడగా లాభాలు కొనసాగుతాయి. ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహి స్తారు. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  ధనుస్సు (Sagittarius మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) దేవుడు మీ వైపే ఉన్నాడని మీకు అర్థమవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల్లో పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీసా సమస్య పరిష్కారమవుతుంది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది.

  మకరం (Capricorn ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) మీ వర్క్ ఫ్రమ్ హెూమ్ బాగానే సాగిపోతుంది. కొద్దిగా నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. జేబు నిండుగా ఉంటుంది. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు యుగళ గీతంలోకి దిగుతాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. హామీలు ఉండవద్దు.

  కుంభం (Aquarius ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఏలినాటి శని పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచండి. విహార యాత్రకు వెళ్లడం ఉత్తమం. ప్రతి పనికీ బాగా చెమటోడ్చాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు కొద్దిగా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు దెబ్బలు తగలవచ్చు.

  మీనం (Pisces పూర్వా భాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) శుభయోగం పట్టబోతోంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మీ వల్ల కొందరికి కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఉద్యోగంలో సానుకూలమైన మార్పు ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
  Published by:Sumanth Kanukula
  First published: