• Home
  • »
  • News
  • »
  • astrology
  • »
  • HOROSCOPE TODAY 22 JUNE 2021 ASTROLOGY PREDICTS THES ZODIAC SIGNS FINANCIAL POSITION WILL BE IMPROVE CHECK YOUR RASI HERE NK

Horoscope 22 June, 2021: ఈ రాశుల వారికి మెరుగవ్వనున్న ఆర్థిక పరిస్థితి

Horoscope 22 June, 2021: ఈ రాశుల వారికి మెరుగవ్వనున్న ఆర్థిక పరిస్థితి

Horoscope today June 22, 2021: రాశులకు సంబంధించి ఆ రాశిలోని నక్షత్రాలతో ఈ విశ్వానికి సంబంధం ఉందని అందువల్ల వాటిపై రకరకాల ప్రభావాలు పడుతుంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

  • Share this:
    Daily Horoscope: ఈ విశ్వం ఎంత పెద్దదో, ఎంత దూరం విస్తరించి ఉందో మనకు తెలియదు. మనం ఉన్నది పాలపుంత (Milkyway) గెలాక్సీలో అని మనకు తెలుసు. ఐతే, ఆ గెలాక్సీలో మనం ఎక్కడ ఉన్నాం... మధ్యలో ఉన్నామా... దూరంగా ఉన్నామా... ఇది కూడా మనకు తెలియదు. అసలీ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో... ఈ విశ్వం లాంటి విశ్వాలు మరిన్ని ఉన్నాయా అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వం మొత్తాన్నీ బలమైన శక్తి ఒకటి నడిపిస్తుందనీ... అది అన్ని అణువుల కేంద్రంలో ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆ శక్తి వల్లే ప్రతి రాశి వారిపైనా రకరకాల ప్రభావాలు ఉంటాయని సూచిస్తున్నారు. మరి జూన్ 22, 2021 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వ్యాపారంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మిత్రులతో అపార్థాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    ఉద్యోగంలో పురోగతి కనిపిస్తోంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఎంతో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా గట్టెక్కుతారు. వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పది మందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఓ కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. మిమ్మల్ని స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు.

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదిస్తారు. కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి.

    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగపరంగా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు.

    తుల రాశి (Libra) (September 24-October 23):
    ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతాయి. ఎంతో శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల్లో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి అవకాశం ఉంది. మిత్రులకు సహాయ పడతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కుతారు. ఆదాయానికి సంబంధించి మీ ప్రయత్నాలు చక్కని ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. పిల్లలతో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అవరోధాలు తొలగుతాయి. తోబుట్టువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.

    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సహనంతో వ్యవహరించండి. ఆటంకాలు, అవరోధాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కష్టకాలంలో మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. దగ్గరి బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారు ఇతరుల్ని లెక్క చెయ్యరు... డోంట్ కేర్ మనస్తత్వం

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితాలుంటాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో మచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
    Published by:Krishna Kumar N
    First published: