Horoscope today 22-7-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు.. జాగ్రత్తగా ఉండాలి

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేటి రాశి ఫలాలు. ఇవాళ ఎవరికి ఎలా ఉంది.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope today: ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం ఊహించలేం. ఐతే రాశి ఫలాల ద్వారా కొంత వరకు మన భవిష్యత్‌ను తెలుసుకోవచ్చు. గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను అందిస్తున్నారు. ఏ రాశి వారికి బాగుంది? ఏ రాశి వారికి బాగాలేదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు. మరి 22-7-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెెలుసుకుందాం.

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సామాజిక సేవతో గుర్తింపు తెచ్చుకుంటారు. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరిగి అప్పు చేయాల్సి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలతో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులు బాగా సహకరిస్తారు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) మంచి కాలం నడుస్తోంది. అదృష్టం పట్టే అవకాశముంది. ఉద్యోగం బాగానే ఉంటుంది. మిత్రుల ద్వారా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులకు చాలా బాగుంది.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కొన్ని ఇబ్బందులను అధిగమించి పనులు పూర్తి చేసుకుంటారు. ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చు కూడా పెరుగుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కృషి తగిన ఫలితం కనిపిస్తుంది. సహనంతో వ్యవహరిస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) మనోబలంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు బాధించకుండా చూసుకోండి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. పలు మార్గాల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఉద్యోగంలో కొందరు సీనియర్ల నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఆర్థికంగా పరవాలేదు. అయితే, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఒత్తిడి తెస్తాయి. కలహాలకు, అపార్థాలకు అవకాశం ఉంది. వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కొద్దిగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా సమయం బాగానే ఉంది. అవరోధాలున్నా శ్రమ మీద కొన్ని పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. స్థిరమైన ఉద్యోగం లభించవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు.

  ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) కాలం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభముంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. వివాదాల జోలికి పోవద్దు. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆదాయం బాగానే ఉన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సొంత నిర్ణయాల కన్నా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. సహనంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యం పరవాలేదు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు చక్కగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విలాసాల కంటే అవసరాలు ముఖ్యం అని గ్రహించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్తంత సహనంతో వ్యవహరించడం అవసరం. సొంత ఊళ్లోనే మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం పొందుతారు. వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. వీలైనంతగా వృథా వ్యయాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు.
  Published by:Shiva Kumar Addula
  First published: