Zodiac signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (జనవరి 21, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రోజు గ్రహస్థితి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
శుభ కార్యాలకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరఫు బంధువు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణ సూచనలున్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి.. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. డబ్బు నష్టం జరుగుతుంది.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో కంపెనీ నుంచి అనుకూల సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆస్తి కొనుగోలు విషయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. షాపింగ్ చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. సమీప బంధువుకు సంబంధించి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి ఉద్యోగాకు సంబంధించి విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనకు దిగవద్దు.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
గ్రహగతులు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. శివార్చన చేయించండి.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శుభకార్యాలు తలపెడతారు. ఏలినాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగే సూచనులున్నాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ డబ్బు
ఇవ్వొద్దు.