Horoscope 21-7-2021: ఈ రాశుల వారికి లక్ష్య సిద్ధి.. వారికి తొలగనున్న రుణ బాధలు

Horoscope 21-7-2021: రాశి ఫలాలు

Horoscope today: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి... జ్యోతిష పండితులు 21 జులై 2021 నాడు ఏ రాశి వారికి ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope today: దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతగొప్పగా లేవు. తగ్గాల్సిన కరోనా ఇంకా పూర్తిగా వదల్లేదు. ఇలాంటి సమయంలో ఆర్థిక పరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. రాశి ఫలాల ద్వారా ఎదురవ్వబోయే సమస్యల్ని ముందుగానే కొంతవరకూ తెలుసుకోవచ్చు. తద్వారా అప్రమత్తం అయి వాటి నుంచి బయటపడవచ్చు. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 21-7-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలవారు విశేషంగా లాభాలు ఆర్జిస్తారు. డబ్బు అవసరాలు తీరతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.

  వృషభ రాశి (Taurus)
  విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు కొద్దిగా పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు

  మిథున రాశి (Gemini)
  ఎంతో శ్రమ మీద మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. శుభ వార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు అన్ని విధాలా బాగుంది. సమాజ సేవలో నిమగ్నమవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది.

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రుణ బాధ చాలావరకు తొలగుతుంది. బంధువర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. కొన్ని ఆర్థిక వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది.

  సింహ రాశి (Leo)
  ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

  కన్య రాశి (Virgo)
  స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నం వాయిదా పడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

  తుల రాశి (Libra)
  రాజకీయంగా పలుకుబడిగల వారితో పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యాల విషయంలో చర్చిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల వారు బాగా రాణిస్తారు.

  ఇది కూడా చదవండి: Business Ideas: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.30వేల లాభం

  వృశ్చిక రాశి (Scorpio)
  వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు బిజీ అవుతారు.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగపరంగా, ఆదాయపరంగా కాలం అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. చాలావరకు రుణ బాధ నుంచి బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

  మకర రాశి (Capricorn)
  ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ వార్తలు వింటారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

  కుంభ రాశి (Aquarius)
  ఆర్థిక, వ్యాపార లావాదేవీలు కుదర్చుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  మీన రాశి (Pisces)
  ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా, లక్ష్యాలు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఆశించినంత అనుకూలించవు.
  Published by:Krishna Kumar N
  First published: