• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 21 4 2021 ASTROLOGY SHOWS TODAY THESE ZODIAC SIGNS MAY PARTICIPATE IN EVENTS SCAN YOUR RASI PHALALU HERE NK

Horoscope today 21-4-2021: నేటి రాశి ఫలాలు. ఈ రాశులవారికి శుభకార్య యోగం

Horoscope today 21-4-2021: నేటి రాశి ఫలాలు. ఈ రాశులవారికి శుభకార్య యోగం

Horoscope today 21-4-2021: నేటి రాశి ఫలాలు. (image credit - shutterstock)

Horoscope today 21-4-2021: వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి తరుణంగా జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారికి ఇవాళ ఎలా కలిసొస్తుందో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today on 21-4-2021: దేశం ధైర్యంగా ముందడుగు వేసుకుంటూ వెళ్లే సమయం. ప్రతి ఒక్కరం ఓ చిన్ని క్రిమితో పోరాటం చేయాల్సిన తరుణం. మరి ఇలాంటి రోజుల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి ఇవాళ కలిసొస్తుంది. ఏ రాశి వారికి ఇవాళ కొన్ని సమస్యలుంటాయి. ఎలా వాటిని అధిగమించాలి. ఇందుకు సంబంధించి ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష పండితులు మనకు ఇవాళ రాశిఫలాలు అందిస్తున్నారు. కొన్ని సూచనలు, కొన్ని అప్రమత్త సందేశాలు ఇస్తున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోవడం ద్వారా... రానున్న ఇబ్బందికర పరిస్థితుల్ని జాగ్రత్తగా ఎదుర్కోవచ్చు. మరి 21-4-2021 నాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

    వృషభ రాశి (Taurus)
    మితిమీరిన ఖర్చుకు కళ్లెం వేయాలి. ఆదాయం పరవా లేదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇరుగు పొరుగుతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు పరవా లేదు. కోర్టు కేసు అనుకూలంగా మారుతుంది.

    మిథున రాశి (Gemini)
    నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.

    కర్కాటక రాశి (Cancer)
    సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

    సింహ రాశి (Leo)
    పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ఇది కూడా చదవండి:Sri Rama Navami 2021: నేడు శ్రీరామనవమి. ఈసారి భద్రాద్రిలో రామయ్య కల్యాణం ఇలా

    కన్య రాశి (Virgo)
    విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం అనుకూలంగానే ఉంటుంది. కోర్టు కేసులో నెగ్గుతారు.

    తుల రాశి (Libra)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్‌ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారులకు బాగుంటుంది.

    కుంభ రాశి (Aquarius)
    సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, స్వయం ఉపాధివారికి చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.

    ఇది కూడా చదవండి: Corona drug: గుడ్ న్యూస్. కరోనాకు కొత్త మందు. ఒక్క రోజులో వైరస్ ఖతం. పూర్తి వివరాలు

    మీన రాశి (Pisces)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: