HOME »NEWS »PROPHECY »horoscope today 20 january 2021 these zodiac signs may get marriage proposals today nk

Horoscope Today: జనవరి 20 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాల ఛాన్స్

Horoscope Today: జనవరి 20 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాల ఛాన్స్
జనవరి 20 రాశి ఫలాలు

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు బుధవారం (జనవరి 20, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    Zodiac signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు బుధవారం (జనవరి 20, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)


    ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. విద్యార్థులకు చాలావరకు బాగుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కోరుకున్న చోట ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యం తలపెడతారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. తలచిన పనులు కొంతవరకు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తవచ్చు. అప్పు తీర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్నేహితురాలితో పెళ్లి గురించి ప్రస్తావిస్తారు. విద్యార్థులకు చాలావరకు బాగుంది.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    రాజకీయాు, సామాజిక సేవ, ట్రావెల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి బాగుంది. ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు, లాయర్లు, ఐ.టి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు పరవాలేదు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. అనుకున్న పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. స్నేహితురాలితో
    సరదాగా గడుపుతారు. విద్యార్థులకు పరవాలేదు. కోర్టు కేసులో విజయం సాధించవచ్చు.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు. శుభకార్యాలకు హాజరవుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి. కోర్టు కేసులు వాయిదా పడే అవకాశం ఉంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. లాయర్లకు బాగుంది. విద్యార్థులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితురాలితో ఆనందంగా, ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు.

    ఇది కూడా చదివేయండి: Zodiac signs: ఈ 5 రాశుల వారికి డబ్బు కొరత ఉండదు... వస్తూనే ఉంటుంది

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    వృత్తి నిపుణులకు అన్ని విధాలా బాగుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. స్నేహితురాలి మీద బాగా డబ్బు ఖర్చు చేస్తారు.
    Published by:Krishna Kumar N
    First published:January 20, 2021, 08:38 IST

    टॉप स्टोरीज