Home /News /astrology /

Horoscope 19-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అప్పు ఇవ్వకండి.. తిరిగి రావు

Horoscope 19-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అప్పు ఇవ్వకండి.. తిరిగి రావు

Horoscope 19-8-2021: రాశి ఫలాలు

Horoscope 19-8-2021: రాశి ఫలాలు

Horoscope Today: నేడు గురువారం. ఇవాళ కొన్ని రాశుల వారికి చాలా బాగుంది. ఆరోగ్యానికీ, ఆదాయానికి ఎలంటి ఢోకా ఉండదు. అనుకున్న పనులన్నీ ఈజీగా జరిగిపోతాయి. కానీ కొందరికి మాత్రం పలు ఇబ్బందులు తప్పవు. శ్రమీ మీద పనులు పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీకి అవకాశం ఉంది. మరి ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  దిన ఫలాలు

  ఆగస్టు 19, 2021

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులు మీ సలహా తీసుకుని పాటిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ రాశి వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే రోజులు ప్రారంభమయ్యాయి. తలచిన పనులు నెరవేరుతాయి. దూర ప్రాంతం నుంచి వివాహ సంబంధం వస్తుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు హాజరవుతారు. అనుకూలమైన స్నేహితురాలు పరిచయం అవుతుంది.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఈ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. బాగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ రాశి వారికి తమ సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉంది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఈ రాశి వారు సంతానానికి సంబంధించి శుభ వార్త వింటారు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. పనులు కొద్దిగా ఆలస్యమైనా అనుకూలంగానే పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఈ రాశిలో కలిగి ఉన్న చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ అబ్బాయిని మంచి ఉద్యోగంలో చేర్చే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఈ రాశి వారి ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా లేదు. ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గృహ రుణానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు.


  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఈ రాశి వారి ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు బాగా శ్రమప డాల్సివస్తుంది.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికి అంది, కొంత రుణ బాధ తగ్గుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయండి. హామీలు ఉండొద్దు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఈ రాశి వారికి ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో సమస్య లు ఎదురవుతాయి.

  మీనం (పూర్వా భాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతారు. వ్యా పార రంగంలోని వారు విస్తరణ కార్యక్రమం చేపడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావా దేవీలు లాభించవు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi fal, Rasi phalalu, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు