Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్..

ప్రతీకాత్మక చిత్రం

నేడు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Today: నేడు శనివారం. ఇవాళ పలు రాశుల వారికి ఉద్యోగ పరంగా ఎంతో బాగుంది. అధికారులు, సహోద్యోగులు సహకరిస్తారు. ప్రశంసలు లభిస్తాయి. కొందరికి అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మరికొందరికి మాత్రం అంత బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనులు ఆలస్యం అవుతుంటాయి. మరి నేడు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    మేష రాశి (Aries): ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాల౦గా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల వారికి కాలం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది.

    వృషభ రాశి (Taurus): నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    మిథున రాశి (Gemini): అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్‌ లేదా ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం ఉంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్య౦ పరవాలేదు

    కర్కాటక రాశి (Cancer): అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రమోషన్‌ లేదా ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం ఉంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్య౦ పరవాలేదు

    సింహ రాశి (Leo): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి తగ్గుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

    కన్య రాశి (Virgo): ఉద్యోగంలో, అధికారులు, సహోద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదాలకు దిగకండి. త్వరలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. మీ స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మీ కోరికొకటి నెరవేరుతుంది.

    తుల రాశి (Libra): ఉద్యోగంలో పని ఒత్తిడి, వేధింపులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు లాభాలార్జిస్తారు.

    వృశ్చిక రాశి (Scorpio): నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. హామీలు కూడా ఇవ్వవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

    ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. స౦తానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం జాగ్రత్త.

    మకర రాశి (Capricorn): ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్చేమీ ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్ళి సంబంధం కుదురుతుంది. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    కుంభ రాశి (Aquarius): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ గానీ, ఇంక్రిమెంట్‌ గానీ లభించే అవకాశ౦ ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

    మీన రాశి (Pisces): ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం సాఫీగానే సాగిపోతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనలకు దిగవద్దు.
    Published by:Sumanth Kanukula
    First published: