Horoscope 17-8-2021: నేటి రాశి ఫలాలు.. డబ్బు జాగ్రత్త.. కొత్త వ్యూహాలు అవసరం

Horoscope 17-8-2021: నేటి రాశి ఫలాలు

Horoscope today 17-8-2021: ఆగస్ట్ నెల సగం ముగిసిపోయింది. ధరలు పెరుగుతుంటే... ఖర్చులు ఎక్కువవుతున్నాయి. మరి జ్యోతిష పండితులు ఇవాళ్టి రాశి ఫలాలు ఎలా ఇచ్చారో చూద్దాం.

 • Share this:
  Horoscope 17-8-2021: రాశి చక్రంలో 12 రాశి ఫలాలకు ప్రత్యేక సమయం ఉంటుంది. ఒక్కో రాశికీ దాదాపు నెల రోజులు ఉంటాయి. అయితే ఆ సమయంలో పుట్టిన వారందరికీ అదే రాశి వర్తించదు. ఎవరిది ఏ రాశి అనేది కాలం, పుట్టిన ప్రదేశం, పుట్టిన సమయం అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫైనల్ చేస్తారు జ్యోతిష పండితులు. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో కూడా ఏ రాశో చెప్పే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో పేరు, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, పుట్టిన సమయం వివరాలు ఇవ్వడం ద్వారా ఉచితంగానే రాశి ఏది అనేది తెలుసుకోవచ్చు. మరి ఇవాళ ఎవరి రాశి ఫలం ఎలా ఉందో... జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తోంది. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

  వృషభ రాశి (Taurus)
  ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తలచిన పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది.

  మిథున రాశి (Gemini)
  ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఫలితముంటుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారులు లాభార్జన చేస్తారు.

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కొత్తవారు పరిచయమవుతారు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి వస్తుంది.

  సింహ రాశి (Leo)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: మీ అత్తగారు ఈ రాశి వారా? మీరు అదృష్టవంతులే!

  కన్య రాశి (Virgo)
  ఉద్యోగంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లావాదేవీల విషయంలో వ్యాపారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది.

  తుల రాశి (Libra)
  కుటుంబంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సమయం అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా పురోగతికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్నేహితులతో పేచీలు రావచ్చు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఆదాయానికి కొరత ఉండదు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులకు ఒక చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు.

  ధనస్సు రాశి (Sagittarius)
  తలచిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  మకర రాశి (Capricorn)
  అనుకోకుండా చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. తీసుకోవద్దు. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంది. స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

  ఇది కూడా చదవండి: Bhakti: మంగళవారం మాంసం తినకూడదు.. ఎందుకో తెలుసా?

  మీన రాశి (Pisces)
  ఒక ప్రతిష్టాత్మక సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.
  Published by:Krishna Kumar N
  First published: