Home /News /astrology /

HOROSCOPE TODAY 16 JANUARY 2022 ASTROLOGY PREDICTIONS TODAY AS PER ZODIAC SIGNS MKS PJC GH

Horoscope Today: జనవరి 16 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది, వీరు జాగ్రత్తగా ఉండాలి

దినఫలాలు

దినఫలాలు

రాశుల ఆధారంగా వ్యక్తుల గమనం ఎలా ఉంటుందనేది జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే, వ్యక్తుల రోజూవారి వ్యవహారాలను రాశి చక్రాలు ప్రభావితం చేస్తాయి. జనవరి 16 (ఆదివారం) నాడు 12 రాశుల వారికి ఎలా గడుస్తుంది. ఏ రాశి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
(పూజా చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఈ రోజు మీ అభిరుచికి తగ్గట్లు నడుచుకుంటారు. ఈ కారణంగా మీరు కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అయితే, ఆర్థికంగా ఈ రోజు మీకు లాభిస్తుంది. మానసిక సౌలభ్యం కోసం పెంపుడు జంతువును ఇంటికి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తారు. కొత్త బంధాలు, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడం కంటే మీకు తెలిసిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు.
అదృష్ట చిహ్నం:- తెరిచిన గేటు

వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే20)
మీకు ఇవాళ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి పరంగా ప్రమోషన్​ గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. మీ పిల్లలకు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. అయితే, ఇంట్లో సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోండి. మీ దిన చర్యలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా మీరు మానసికంగా మరింత చురుకుగా ఉంటారు.
అదృష్ట చిహ్నం:- గులాబీ రేక

మిథునరాశి (మే 21–- జూన్ 21)
ఇవాళ మీ ఇంటిని పునర్నిర్మించాలనే ఆలోచన రావొచ్చు. అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉంది. కొత్త పనులను చేపట్టడం ద్వారా మీలో కొత్త విశ్వాసం కనిపిస్తుంది. మీకు అన్ని శక్తులు సానుకూలంగా ఉంటాయి. గతంలో సమస్యాత్మకంగా, ప్రతికూలంగా ఉన్నవన్నీ మీకు అనుకూలంగా మారతాయి. వ్యాపారులు, రియల్ ఎస్టేట్‌ నిపుణులు, చిన్న వ్యాపార యజమానులకు ఇవాళ కలిసొస్తుంద.ఇ
అదృష్ట చిహ్నం: బుద్ధ విగ్రహం

కర్కాటక రాశి (జూన్ 22 –- జూలై 22)
మీరు యాక్షన్- ఓరియెంటెడ్ ప్లాన్‌లపై దృష్టి కేంద్రీకరించినట్లయితే, కాస్త విరామం తీసుకొనిన ప్రారంభించండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మీ ఆఫీసులో మారుతున్న పని వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, అది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.
అదృష్ట చిహ్నం: ఒక పోర్ట్రెయిట్

సింహ రాశి: జూలై 23 –- ఆగస్టు 22
నిబద్ధతతో కొత్త పనులు చేపడుతారు. రిస్క్‌తో కూడిన దూకుడు విధానం మీకు పురోగతికి సహాయపడవచ్చు. మీ సహజమైన ఆకర్షణతో నెట్‌వర్క్‌ని పెంచుకోండి. మీ అయస్కాంత వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. తద్వారా, వారు మీ అభిప్రాయాలు, ఆలోచనలకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
అదృష్ట సంకేతం: స్వీట్​ బాక్సు

కన్యా రాశి: ఆగస్టు 23 – -సెప్టెంబర్ 22
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎక్కువ శ్రద్ద వహిస్తారు. మీ రహస్యాలను దాచిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, మీ రహస్యాలను ఇతరులకు చెప్పకుండా జాగ్రత్త వహించండి. మీరు మార్నింగ్ వర్కవుట్‌లతో ఇబ్బంది పడుతుంటే, మధ్యాహ్న విరామం సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. సన్నిహిత సంబంధాలతో వ్యాపారాన్ని కలపకుండా ప్రయత్నించండి.
లక్కీ సైన్:- పేరు ట్యాగ్

తులా రాశి (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 23)
మీ జీవితంలో ఆశించిన ఎదుగుదల లేదని బాధపడుతుంటారు. అయితే, ఇది తాత్కాలికం మాత్రమే. భవిష్యత్తులో మీరు జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి తగినన్ని అవకాశాలు ఉంటాయి. మీ ప్రమోషన్ గురించి త్వరలోనే చర్చలు జరుగుతాయి.
అదృష్ట చిహ్నం:- వాకింగ్ స్టిక్

వృశ్చిక రాశి (అక్టోబర్ 24 –- నవంబర్ 21)
మీకు ఇవాళ బాగా కలిసొస్తుంది. మీరు వాస్తవిక ధోరణిలో ఆలోచిస్తారు. ఇది మీరు గొప్పగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీ భాగస్వామి అనారోగ్య భారీన పడే అవకాశం ఉంది. అందుకే, వారి పట్ల ఎక్కువ శ్రద్ద చూపండి. ఈ రోజు కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కొంటారు. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచనలు వస్తాయి.
అదృష్ట చిహ్నం: చెక్క పెట్టె

ధనుస్సు రాశి: (నవంబర్ 22 –- డిసెంబర్ 21)
మీరు ఈరోజు స్నేహితులతో కలిసి షాపింగ్​ చేస్తారు. వారితో మీ వ్యాపార ఆలోచనను పంచుకుంటారు. మీ కొత్త వ్యాపారానికి వేగంగా అడుగులు వేస్తారు. విశ్రాంతి కోసం మరొక నగరానికి కుటుంబంతో కలిసి పర్యటిస్తారు.
అదృష్ట చిహ్నం:- గులాబీ పువ్వులు

మకర రాశి (డిసెంబర్ 22 –- జనవరి 19)
కుటుంబ సమేతంగా ఒక వేడుకకు హాజరు కావాల్సి రావచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. ఈ నెలాఖరులోగా కొత్త వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఎవరినీ బహిరంగంగా విమర్శించవద్దు. దీని ద్వారా భవిష్యత్తులో సమస్యలొస్తాయి.
లక్కీ సైన్: సరికొత్త నాణెం

కుంభ రాశి (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అవసరంలో ఉన్న మీ స్నేహితుని పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తితో ఉంటారు. అయితే, అవి చర్చల స్థాయిలో ఉంటాయి. మీ వివాహం మరి కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. అయితే, మీకు ఇష్టమైన వ్యక్తినే వివాహం చేసుకుంటారు.
అదృష్ట చిహ్నం:- అక్వేరియం

మీన రాశి (ఫిబ్రవరి 19 -– మార్చి 20)
మీరు చేస్తున్న పనికి వచ్చే రాబడికి పొంతన ఉండదు. తద్వారా వృత్తి జీవితంలో నిరాశ చెందుతుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా ఒంటరితనం నుంచి బయటపడతారు. ప్రస్తుత వాతావరణం మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించవచ్చు. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి.
లక్కీ సైన్: - టాన్జేరిన్ ప్లేట్లు
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు