Horoscope 16-8-2021: నేటి రాశిఫలాలు.. పనులు పూర్తి.. సమస్యలపై దృష్టి

Horoscope 16-8-2021: నేటి రాశిఫలాలు

Horoscope today 16-8-2021: ఈ రోజు సోమవారం. మరి ఇవాళ రాశి ఫలాలు ఏం సూచిస్తున్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉన్నాయి. జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope 16-8-2021: రాశి ఫలాలు వేగంగా మారిపోతున్నాయి. కాలంలో మార్పులు వస్తున్నాయి. ఈ సంవత్సరం రుతుపవనాల వల్ల వర్షాలు బాగానే పడుతున్నాయి. అదే సమయంలో కరోనా మాత్రం పూర్తిగా తగ్గట్లేదు. మరి ఇలాంటి రోజుల్లో సూర్యగమనం ఆధారంగా రాశి ఫలాలు ఎలా మారబోతున్నాయి. గ్రహాల కదలిక రాశులు వాటి నక్షత్రాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది. ఉద్యోగార్థులకు ఎలా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకూ వస్తాయి. ప్రేమ సంగతులేంటి... వ్యాపారాలు, ఆస్తి వ్యవహారాలు ఎలా సాగుతాయి... వంటి అంశాలపై నేటి రాశి ఫలాల్లో జ్యోతిష పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. సన్నిహితుల సహాయంతో చక్కగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు.

    వృషభ రాశి (Taurus)
    అధిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. శ్రమ ఉన్నా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సన్నిహితులకు ఆర్థికంగా సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబసమేతంగా విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

    మిథున రాశి (Gemini)
    మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సమస్యలు తలచుకుని కుంగిపోవద్దు. మంచి నిర్ణయాలతో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer)
    ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: మీ అత్తగారు ఈ రాశి వారా? మీరు అదృష్టవంతులే!

    సింహ రాశి (Leo)
    కుటుంబపరంగా సమస్యలున్నా ముందుకు దూసుకు వెడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఇక నీళ్లు వదిలేసుకున్న బకాయి అనుకోని విధంగా చేతికి అందుతుంది. ఇప్పుడు తలపెట్టిన పనులు మున్ముందు విజయాన్నిస్తాయి.

    కన్య రాశి (Virgo)
    ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని చక్కగా పూర్తి చేస్తారు.

    తుల రాశి (Libra)
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యకలాపాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశి వారు ఎలాంటి వారిని ఇష్టపడతారు.. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి?

    మకర రాశి (Capricorn)
    అన్ని కోణాల నుంచి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్టకార్యాలను పట్టుదలగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అదనపు ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

    మీన రాశి (Pisces)
    అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు.
    Published by:Krishna Kumar N
    First published: