• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 15 5 2021 ASTROLOGY SHOW THAT THESE ZODIAC SIGNS CAN GET BENEFITS WITH NEW DECISIONS SCAN YOUR RASI PHALALU HERE NK

Horoscope 15-5-2021: ఈ రాశుల వారికి కొత్త నిర్ణయాలు కలిసొచ్చే అవకాశాలు

Horoscope 15-5-2021: ఈ రాశుల వారికి కొత్త నిర్ణయాలు కలిసొచ్చే అవకాశాలు

ఈ రాశుల వారికి కొత్త నిర్ణయాలు కలిసొచ్చే అవకాశాలు (image credit - shutter stock)

Horoscope 15-5-2021: నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పుట్టిన తేదీ ఆధారంగా ఎవరి రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయి? వివాహ సంబంధాలు ఏ రాశుల వారికి కుదురుతున్నాయి? అన్ని విశేషాలూ తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today 15-5-2021: ప్రతి రోజూ ఉదయం వేళ రాశి ఫలాలు తెలుసుకుంటే... ఆ రోజంతా ఓ ప్లాన్ ప్రకారం సాగుతుంది. అంటే ఆ రోజు రాశి ఫలాల్లో అంతా బాగుంది అని ఉంటే... ఇక ఆ రోజు ఏ టెన్షనూ లేకుండా ఉండొచ్చు. అలా కాకుండా... ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు అని ఉంటే... ఆ రోజంతా మౌనంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని అంటే... అప్పుడు ఖర్చుల విషయంలో, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండొచ్చు. ఇలా రాశి ఫలాల్లో చెప్పిన దాన్ని బట్టీ అప్రమత్తం అవ్వడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    మంచి కాలం నడుస్తోంది. విజయాలు, సాఫల్యాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.

    వృషభ రాశి (Taurus)
    ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    మిథున రాశి (Gemini)
    ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం సంభవం.

    కర్కాటక రాశి (Cancer)
    కోరికలు నెరవేరుతాయి. గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారుల కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మెరుగ్గా ఉంది.

    సింహ రాశి (Leo)
    కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలను ఇస్తాయి. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. మిత్రులు, స్నేహితురాలి ద్వారా మనస్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    కన్య రాశి (Virgo)
    తలపెట్టిన పనులు సఫమవుతాయి. ఇది కలిసొచ్చే కాలం. అందువల్ల మేలైన భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి అభినందనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.

    తుల రాశి (Libra)
    అనుకున్న పనులు పూర్తవుతాయి. ఎటు చూసినా విజయాలే కనిపిస్తున్నాయి. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. అనేక విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. శత్రుపీడ తొలగుతుంది. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి
    శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్‌ వస్తుంది. విద్యార్థులకు బాగుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.

    మకర రాశి (Capricorn)
    ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అనేక అవరోధాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. బంధువుల్లో మిమ్మల్ని అవమానించే వారుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

    కుంభ రాశి (Aquarius)
    అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇది మంచి సమయం. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువవుతుంది. రుణాల నుంచి కొద్దిగా బయటపడతారు. సమీప బంధువుతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు ఇతరుల ఐడియాలను దొంగిలిస్తారు...

    మీన రాశి (Pisces)
    ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో సహోద్యోగులు అవరోధాలు సృష్టించే అవకాశముంది. ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు