Home /News /astrology /

HOROSCOPE TODAY 14 JUNE 2021 DETAILED DAILY ASTROLOGY PREDICTION OF YOUR ZODIAC SIGN AND OTHERS RASI PHALALU IS HERE KNOW IT NK

Horoscope today June 14, 2021: రాశి ఫలాలు... ఏ రాశి వారికి ఎలాంటి ఫలం?

Horoscope today June 14, 2021: రాశి ఫలాలు

Horoscope today June 14, 2021: రాశి ఫలాలు

Horoscope 14 June 2021: ఈ సోమవారం. పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు. మరి ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి అదృష్టం ఎలా పలకరించబోతోందో జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకుందాం.

    Horoscope Daily: ఈ రోజుల్లో భవిష్యత్తును కొంతవరకూ అంచనా వెయ్యగలం. కానీ మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటప్పుడు జరగబోయే విపత్తులను ముందే తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడవచ్చు. అందుకు రాశి ఫలాలు చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఓ జర్నీ చెయ్యాలనుకున్నప్పుడు... రాశి ఫలాల్లో ప్రయాణాల్లో జాగ్రత్త అని చెబితే... ఆ జర్నీ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండవచ్చు. అలాగే... ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి అని చెప్పినప్పుడు ప్రేమ, వివాహం వంటి అంశాలపై ముందుకెళ్లవచ్చు. ఇలా రాశి ఫలాలు మనల్ని మంచి ఉద్దేశాలవైపు నడిపిస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి 14 జూన్ 2021 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితాలుంటాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    ఆటంకాలు, అవరోధాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ముఖ్యమైన కుటుంబసమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గరి బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    అనుకున్న పనులు నెరవేరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కూడా చాలావరకు కుదుటపడుతుంది. కొద్దిగా సహనంతో వ్యవహరిస్తే అన్నీ మీకు సానుకూలమవుతాయి.

    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి.

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    మంచి శుభయోగాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థితి కనిపిస్తోంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యానికి ధోకా ఉండదు.

    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగంలో అధికారుల వల్ల బాగా శ్రమ ఉంటుంది. ఆటంకాలు, అవరోధాలు ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

    తుల రాశి (Libra) (September 24-October 23):
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. అవాంఛనీయ పరిచయాలకు దూరంగా ఉండండి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు గట్టెక్కుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. పెళ్లి సంబంధం ఆలస్యం అవుతుంది.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    ఉద్యోగంలో ఇబ్బందులు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి చాకచక్యంగా బయటపడతారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం పెండింగ్‌లో పడుతుంది.

    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    అనుకోని ఆటంకాల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    ఇది కూడా చదవండి: పగబట్టిన కాకి?.. సెర్బియాలో తెలుగు యూట్యూబర్‌ తిప్పలు.. వీడియో చూసి నవ్వుకోండి

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    ఉద్యోగ జీవితంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. తగిన విధంగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు