Horoscope today: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ ఆఫర్లు.. పెళ్లి యోగం

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope 14-8-2021: నేటి రాశి ఫలాల్లో ఎలాంటి శుభ సూచికలు ఉన్నాయి... వివాహాలు ఏ రాశుల వారికి కుదిరే అవకాశాలు ఉన్నాయి... ఉద్యోగాలు ఎవరికి వస్తాయి... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope 14-8-2021: మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని మైనస్ పాయింట్లూ ఉంటాయి. కొంత మంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు. మరికొందరు రిస్క్ చేయాలంటే వెనకడుగు వేస్తారు. కొంత మంది తెలివి తేటలతో సక్సెస్ అయితే... మరికొంత మంది కష్టాన్నే నమ్ముకొని విజయం సాధిస్తారు. ఈ జరిగే పరిణామాలకూ రాశి ఫలాలకూ సంబంధం ఉందంటారు జ్యోతిష పండితులు. సూర్యగమనం, గ్రహ బలాలు, తిథులు, నక్షత్రాలు, కాలం, వర్జ్యం ఇలా ఎన్నో అంశాలు మనపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. కొందరికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.

  వృషభ రాశి (Taurus)
  సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పలు ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధివారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.

  ఇది కూడా చదవండి: Aura: ఆరా అంటే ఏంటి? మన చుట్టూ కాంతి ఉంటుందా?

  మిథున రాశి (Gemini)
  ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. కొద్ది శ్రమతో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

  కర్కాటక రాశి (Cancer)
  ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు నిలకడగా లాభాలుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి నిపుణులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.

  సింహ రాశి (Leo)
  ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం చాలా అనుకూలంగా ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి బాగుంది.

  కన్య రాశి (Virgo)
  అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  తుల రాశి (Libra)
  చదువులు, ఉద్యోగాల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారులు శ్రమ మీద లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  వృశ్చిక రాశి (Scorpio)
  పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం సానుకూలపడుతుంది. తగాదాల్లో తల దూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల వారికి పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  ధనస్సు రాశి (Sagittarius)
  నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  ఇది కూడా చదవండి: Aura: ఆరా అంటే ఏంటి? మన చుట్టూ కాంతి ఉంటుందా?

  మకర రాశి (Capricorn)
  నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

  కుంభ రాశి (Aquarius)
  అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పరవాలేదు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇరుగు పొరుగుతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు పరవాలేదు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి.

  ఇది కూడా చదవండి: Aura: ఆరా అంటే ఏంటి? మన చుట్టూ కాంతి ఉంటుందా?

  మీన రాశి (Pisces)
  వృత్తి నిపుణులు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రమోషన్ మీద దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: