Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అస్సలు బాలేదు.. ప్రతి పనికీ ఆటంకం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope 13-8-2021: నేడు శుక్రవారం. ఇవాళ కొన్ని రాశుల వారికి అద్భుతగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కానీ కొన్ని రాశుల వారి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    కాల జ్ఞానం

    దిన ఫలాలు

    ఆగస్టు 13, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)- ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)- ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వృత్తి నిపుణులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)- మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)- సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి నిపు ణులకు బాగుంది.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)- ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్య వహారాలు ఫలిస్తాయి.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)- ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)- ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతోంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.



    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)- చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడే సూచనలున్నాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంది.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)- అనుకూలమైన సమయం ఇది. తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. వ్యాపారంలో విశేషమైన పురోగతి కనిపిస్తోంది.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ఠ 1,2)- కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. వృత్తి నిపుణులు శ్రమపడాల్సి ఉంటుంది.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3)- అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొల గుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)- గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా ఉండవు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: