Horoscope Today: నేటి రాశి ఫలాలు.. సోదరులతో ఆస్తి తగాదాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త

Horoscope 12-8-2021: నేటి రాశి ఫలాలు

Horoscope Today: ఇవాళ గురువారం. నేడు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. తలచిన పనులన్నీ నెరవరుతాయి. వివాహ ప్రయత్నలు ఫలిస్తాయి. మరికొందరికి మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆస్తి విషయంలో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉందో.. ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    దినఫలాలు

    ఆగస్టు 12, 2021



    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)- ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితురాలికి బహుమతులు కొనిస్తారు. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)- ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసు అనుకూలం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)- ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు. కోర్టు కేసు వాయిదా పడుతుంది.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)- ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు మిత్రుల సహాయంతో నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగంవస్తుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)- ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)- దగ్గరి బంధువులను ఆదుకుంటారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)- ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సోదరులతో ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. వ్యాపారులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)- ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)- ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వ్యాపారులు శ్రమ పడక తప్పదు.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)- ఆదాయం బాగానే ఉంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేయడంలో సహైద్యోగులు సహకరిస్తారు. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)- ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గించుకుంటారు. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)- తల పెట్టిన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడడానికి వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.
    Published by:Shiva Kumar Addula
    First published: