• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 12 5 2021 ASTROLOGY TELL THESE ZODIAC SIGNS MUST TAKE OWN DECISIONS BROWSE YOUR RASI PHALALU TODAY HERE NK

Horoscope 12-5-2021: ఈ రాశుల వారికి సొంత నిర్ణయాలు కలిసొస్తాయి

Horoscope 12-5-2021: ఈ రాశుల వారికి సొంత నిర్ణయాలు కలిసొస్తాయి

Horoscope 12-5-2021: ఈ రాశుల వారికి సొంత నిర్ణయాలు కలిసొస్తాయి

Horoscope 12-5-2021: ఇండియాలో పరిస్థితులు నానాటికీ మారుతున్నాయి. మరి దేశవ్యాప్తంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఎవరికి కలిసొస్తుంది... నేటి రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today 12-5-2021: రాశి ఫలాలకు సంబంధించి... గ్రహాల ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రధానంగా శుక్రగ్రహం (venus) ఇప్పుడు ప్రభావం చూపిస్తోంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి మానవ సంబంధాలు మెరుగవుతూ... ప్రేమ, పెళ్లి సంబంధాల వంటివి కుదురుతున్నాయి. మరికొన్ని రాశుల వారికి ఉన్న సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయి. ఆవేశంలో అనే మాటలు అవతలి వారికి తీవ్ర మనోవేదన కలిగిస్తాయి. అందువల్ల మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకొని అప్రమత్తం అవుదాం.

    మేష రాశి (Aries)
    శుభవార్త వింటారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

    వృషభ రాశి (Taurus)
    అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

    మిథున రాశి (Gemini)
    ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer)
    పట్టుదగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

    సింహ రాశి (Leo)
    ఇంటా బయటా సమస్యలు ఉన్నా ముందుకు దూసుకు వెళ్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఎదుగుదకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్ని ఇస్తాయి.

    కన్య రాశి (Virgo)
    ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. సంతానం గురించి శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి.

    తుల రాశి (Libra)
    ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఇంటా బయటా సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు.

    ధనస్సు రాశి (Sagittarius)
    మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్పం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూంగా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

    మకర రాశి (Capricorn)
    బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

    కుంభ రాశి (Aquarius)
    ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూంగా ఉంది. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: మీ రాశి ఆధారంగా మీలో దాగి ఉండే టాలెంట్ మీకు తెలుసా?

    మీన రాశి (Pisces)
    సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవా లేదు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు