Horoscope 11-8-2021: నేటి రాశి ఫలాలు.. పనుల్లో పురోగతి.. ఖర్చుల సవాళ్లు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope daily 11-8-2021: గురువారం రాత్రి ఉల్కాపాతం ఉంది. భూమివైపు ఓ తోకచుక్క వస్తోంది. మరి... గ్రహాలు ఎలా ప్రభావితం అవుతాయి... నేటి రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope today 11-8-2021: గతేడాది కంటే ఈ ఏడాది బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా లేదుగా... మనం లాస్ట్ ఇయర్ ఎలా కరోనాతో ఇబ్బంది పడ్డామో ఈ సంవత్సరమూ అలాగే పడుతున్నాం. తేడా ఏముంది... వ్యాక్సిన్ వచ్చింది అంతే. వచ్చినా కరోనా మాత్రం తగ్గలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... 11-8-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ధనలాభం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. సుఖసంతోషాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

  వృషభ రాశి (Taurus)
  ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొందరు బంధువుల నుంచి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

  ఇది కూడా చదవండి: Vastu tips: ఖర్చులు పెరుగుతున్నాయా.. ఆ వస్తువులు పారేయండి

  మిథున రాశి (Gemini)
  అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో, శాంతికి, సుఖానికి లోటుండదు. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

  కర్కాటక రాశి (Cancer)
  ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

  సింహ రాశి (Leo)
  ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి ఉంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  కన్య రాశి (Virgo)
  ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశులపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం.. ఎవరిపై ఎలా ఉంటుందంటే?

  తుల రాశి (Libra)
  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా తగ్గి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఉద్యోగ జీవితం నిలకడగా ఉంటుంది. వ్యాపారపరంగా అప్రమత్తంగా ఉంటే మంచిది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల నష్టం జరగవచ్చు.

  మకర రాశి (Capricorn)
  వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలు పెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదనపు బాధ్యతల తో శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి.

  ఇది కూడా చదవండి: Video: జ్యూసులు చేసి ఇస్తున్న పిల్లి!.. ఏది కావాలన్నా క్షణాల్లో రెడీ!

  మీన రాశి (Pisces)
  ఆదాయ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గట్టి సంకల్ప బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతర సంస్థల నుంచి కొత్త ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  Published by:Krishna Kumar N
  First published: