Horoscope 10-8-2021: రాశి ఫలాలు. ఆర్థిక ఫలాలు, సవాళ్లు

Horoscope 10-8-2021: రాశి ఫలాలు.

Horoscope today 10-8-2021: నేటి రాశి ఫలాల్లో ఏయే ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రావణమాసం మంగళవారం ఎలాంటి అంశాలను జ్యోతిష పండితులు చెబుతున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today on 10-8-2021: నేడు శ్రావణమాసం... మంగళవారం. ఎంతో మంగళకరమైన రోజు. ఈ రోజున మహిళలు గౌరీ మంగళ వ్రతాలు పూజలు చేస్తారు. మరి ఇలాంటి మంచి రోజున జ్యోతిష పండితులు ఏ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు చెప్పారో, ఎలాంటి అప్రమత్త సందేశాలు ఇచ్చారో మనం తెలుసుకుంటే... తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాంటి మంచి రోజున అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలంటే... మనం ఏం చెయ్యాలో, ఎలా మెలగాలో తెలుసుకోవాలి. అందుకు ఇవాళ్టి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తద్వారా నడుచుకుంటూ... ఈ రోజును సంతృప్తిగా ముగించవచ్చు.

    మేష రాశి (Aries)
    శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత అప్పుల నుంచి బయట పడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. కీలక నిర్ణయాలు తీసుకంటారు. ఇంటాబయటా ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

    వృషభ రాశి (Taurus)
    శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు ఫలితాస్తాయి. ఇంటాబయటా ప్రోత్సహం లభిస్తుంది. ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుంది. అందరినీ కలుపుకుని వెళితే మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    మిథున రాశి (Gemini)
    ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారాల్లో ఒత్తిడిలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు నిరాశ తప్పదు.

    ఇది కూడా చదవండి: Shravana Masam 2021: శ్రావణమాసంలో పాలు తాగరు.. ఎందుకో తెలుసా?

    కర్కాటక రాశి (Cancer)
    కొత్తగా రుణాలు చేస్తున్నారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం.. ఇంటా బయటా ఒత్తిడిలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూలించదు.

    సింహ రాశి (Leo)
    కొత్త వ్యక్తుల పరిచయం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనుకూల దినం.

    కన్య రాశి (Virgo)
    రుణ ఒత్తిడులు తొలగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, వ్యాపార, ఉద్యోగాల్లో ఉత్సాహం ఉంటుంది.

    తుల రాశి (Libra)
    ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. అనుకోని ధన వ్యయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    పనుల్లో జాప్యం.. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. వ్యాపారాల్లో కొంత గందరగోళం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి తప్పదు.

    ధనస్సు రాశి (Sagittarius)
    అనుకున్నపనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదలు పరిష్కారం అవుతాయి. వాహనయోగం ఉంది. వ్యయం పెరుగుతుంది. ఆలోచనలు కలిసిరావు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు.

    ఇది కూడా చదవండి: Dhana Yoga: ధనయోగం అంటే?.. అది పట్టాలంటే ఏం చెయ్యాలి?

    మకర రాశి (Capricorn)
    ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ధన వ్యయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఆలోచనలు కలిసిరావు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు.

    కుంభ రాశి (Aquarius)
    పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విచిత్రమైన సంఘటనలు.. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

    మీన రాశి (Pisces)
    కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు.. శ్రమాధిక్యం ఇంటాబయటా ఒత్తిడిలు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.
    Published by:Krishna Kumar N
    First published: