• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 10 5 2021 FINANCIALLY TODAY THESE ZODIAC SIGNS GET BENEFITS CHECK YOUR RASI PHALALU BY ASTROLOGY NK

Horoscope 10-5-2021: ఈ రాశుల వారికి నేడు ఆర్థిక లాభాలు... కొన్ని జాగ్రత్తలు

Horoscope 10-5-2021: ఈ రాశుల వారికి నేడు ఆర్థిక లాభాలు... కొన్ని జాగ్రత్తలు

ఈ రాశుల వారికి నేడు ఆర్థిక లాభాలు (image credit - shutter Stock)

Horoscope 10-5-2021: దేశంలోని 22 రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో రాశి ఫలాలు ఏం చెబుతున్నాయి? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope 10-5-2021: రాశి ఫలాలకు సంబంధించి చాలా మార్పులు వస్తున్నాయి. కొంత మంది ఆర్థికంగా దెబ్బతింటుంటే... మరికొంత మంది బలపడుతున్నారు. డబ్బు మనుషుల మధ్య తారతమ్యాలను పెంచేస్తోంది. ఈ కరోనా వచ్చాక దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో... భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని అనుకోలేం. కచ్చితంగా ఏవో ఒక విపరిణామాలు ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తిస్తూ ఎదుర్కొనేందుకు రాశి ఫలాలు కొంతవరకూ ఉపయోగపడతాయి. అందువల్ల ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉందో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.

    వృషభ రాశి (Taurus)
    పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో మంచి స్థితి కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్ద సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి అవసరం.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్త వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

    కన్య రాశి (Virgo)
    ధన లాభానికి అవకాశం ఉంది. శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులను సంప్రదిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    తుల రాశి (Libra)
    కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవా లేదు.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనస్సు రాశి (Sagittarius)
    ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవా లేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఒక కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

    కుంభ రాశి (Aquarius)
    తలచిన పనులు త్వరగానే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశుల్లో గాలి, నీరు, నిప్పు, భూ రాశులు... మీది ఏ రాశి... ఏంటి ప్రత్యేకత?

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్త మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు