Horoscope 30-8-2021: నేటి రాశి ఫలాలు.. పనుల్లో వృద్ధి.. శ్రమతో సత్ఫలితాలు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope today 30-8-2021: నేడు జన్మాష్టమి. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. మరి ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

 • Share this:
  Today Horoscope: పండుగ రోజున ఎవరైనా సరే.. తమ రాశి ఫలం బాగుండాలని కోరుకుంటారు. అందులోనూ తన లీలలతో ఓలలాడించే శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఇంట్లోనూ తమ పిల్లల్ని బాలగోపాలుడిగా ముస్తాబు చేసే మంచి రోజు. మరి ఇవాళ జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు ఇచ్చారు. ఏ రాశి వారికి ఏయే ప్రత్యేకతలు చూపించారు. ఎవరికి ఎలాంటి సూచనలు చేశారు వంటి అంశాలను తెలుసుకుందాం. ఏవైనా అప్రమత్త సందేశాలు, చేయకూడని పనులు, తీసుకోకూడని నిర్ణయాలు ఉంటే... తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుందాం. 30-8-2021 నాటి రాశి ఫలాలు ఇవే...

  మేష రాశి (Aries)
  ఉద్యోగంలో మంచి జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిడి కలిగించే పరిస్థితులుంటాయి. ప్రశాంతంగా కూర్చుని మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కలసి వస్తుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు.

  వృషభ రాశి (Taurus)
  ఉద్యోగంలో మీ ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కుటుంబంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని పనుల్లో శ్రమ వృథా అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలపరంగా అనుకూలమైన సమయం. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయి.

  మిథున రాశి (Gemini)
  అన్ని విధాలా కలిసి వస్తుంది. మంచి జీవితానికి పనికివచ్చే పనులు చేస్తారు. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. శుభవార్తా శ్రవణం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

  ఇది కూడా చదవండి: Janmashtami 2021: నేడు జన్మాష్టమి. ఇలా చేస్తే సకల శుభాలు

  కర్కాటక రాశి (Cancer)
  రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. ఆటంకాలు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది.

  సింహ రాశి (Leo)
  ఏ విధంగా చూసినా మంచి కాలం నడుస్తోంది. పదిమందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చక్కగా పనులు పూర్తి చేస్తారు.

  కన్య రాశి (Virgo)
  ఉద్యోగంలో విధులను నిర్వహించడంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. అధికారుల నుంచి మాట వచ్చే సూచనలున్నాయి. ఆటంకాలు, అవరోధాలు తొలగి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొంత వరకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.

  తుల రాశి (Libra)
  ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలను శ్రద్ధగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో మొహమాటాల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

  ఇది కూడా చదవండి: ఇంట్లో డబ్బు నిలవట్లేదా... ఓసారి బీరువా ఇలా ఉందేమో చూసుకోండి!

  వృశ్చిక రాశి (Scorpio)
  ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు, ఒత్తిడి ఉంటాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగంలో మీ ఓర్పు, సహనాలను పరీక్షించే వారున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో బయటివారితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల కారణంగా ఆర్థిక నష్టం జరగడానికి అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

  మకర రాశి (Capricorn)
  ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ధనలాభం ఉంది. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు.

  ఇది కూడా చదవండి: Janmashtami 2021: దేశంలోని 10 శ్రీకృష్ణుడి అలయాలు.. దర్శిస్తే జన్మ ధన్యం!

  మీన రాశి (Pisces)
  ఉద్యోగంలో తగినంత గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. ఉపకార బుద్ధి వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యానికి డోకా లేదు. ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తిలో రాణిస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.
  Published by:Krishna Kumar N
  First published: