Today Horoscope: రోజులు అంతగా బాలేవు. కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే అనుకోని విపత్తులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకు మన తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తున్నాయి. ఎవరికి ఎలాంటి రాశి ఫలాలు ఉన్నాయో తెలుసుకుంటే... తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మానవ సంబంధాల్ని మెరుగు పరచుకోవడం ఈ రోజుల్లో అవసరం. 21-8-2001 నాడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు ఆర్థికంగా లాభం పొందుతారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు అండగా నిలబడతారు.
మిథున రాశి (Gemini)
ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా అందుకు దీటుగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
ఇది కూడా చదవండి: Raksha Bandhan 2021: రక్షాబంధన్ శుభ ముహూర్తం.. విశేషం
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
సింహ రాశి (Leo)
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కన్య రాశి (Virgo)
ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాం. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది అవసరాలు తీరతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆస్తి విషయంలో సమీప బంధువులు బాగా ఇబ్బంది పెడతారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి.
తుల రాశి (Libra)
ఉద్యోగంలో సద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తల పెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Vastu tips: సంపదను పెంచే చేప!.. ఇంట్లో ఆ దిశలో ఉంచండి!
మకర రాశి (Capricorn)
ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.
కుంభ రాశి (Aquarius)
రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు.
మీన రాశి (Pisces)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign, Zodiac signs