Horoscope today: అక్టోబరు 16 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అప్పుల బాధ నుంచి విముక్తి

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, గ్రహాల కదలిక వంటి అంశాల ఆధారంగా.. ప్రతి రోజు దిన ఫలాలు చెబుతారు. వాటి ఫలాల ప్రకారం.. నేడు ఎవరికి బాగుంది? ఎవరికి బాగా లేదు? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను రాశుల వారీగా ఇక్కడ తెలుసుకుందాం.

 • Share this:
  కాలజ్ఞానం

  అక్టోబరు 16, 2021

  దిన ఫలాలు  మేష రాశి (Aries) : ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.

  వృషభ రాశి (Taurus) ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్టితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

  మిథున రాశి (Gemini): తలచిన పనులు త్వరగానే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. హామీలు ఉండొద్దు.

  చాణక్య నీతి.. ఈ భూమిపై అతి భయానకమైన వ్యాధి ఇదే!

  కర్కాటక రాశి (Cancer) ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

  సింహ రాశి (Leo) ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి స౦స్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం కొంత మేరకు పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఒక కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గ డబ్బు అందుతుంది.

  కన్య రాశి (Virgo): ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. అదాయం నిలకడగా ఉంటు౦ది. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  Marriage: ఈ మూడు రాశుల్లో ఏ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరు..!


  తుల రాశి (Libra): కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

  వృశ్చిక రాశి (Scorpio): ధన లాభానికి అవకాశం ఉంది. శమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులతో కలిసి ప్రయత్నిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  Shani puja: శనిదేవుని ఈ 5 విధాలుగా పూజిస్తే.. ఇబ్బందులే ఉండవు!

  ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న చివరికి డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

  మకర రాశి (Capricorn): ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో మంచి స్థితి కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. శమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి అవసరం.

  మీన రాశి (Pisces) పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా స౦ప్రదించండి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో మరింతగా శ్రద్ధ పె౦చాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి
  Published by:Shiva Kumar Addula
  First published: