HOROSCOPE ON 16TH DECEMBER 2021 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS SK
Horoscope Today: డిసెంబరు 16 రాశి ఫలాలు.. వీరికి అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తగా ఉండాలి
ప్రతీకాత్మక చిత్రం
Today Horoscope: నేడు మార్గశిర గురువారం. ఇవాళ పలు రాశుల వారికి చాలా బాగుంది. ముఖ్యంగా కొందరికి ధన లాభం ఉంటే.. మరికొందరికి పెళ్లి ప్రయత్నాలు ఫలించే చాన్స్ ఉంది. ఇంకొందరికి మాత్రం అంతగా బాగాలేదు. మరి ఇవాళ మేషం నుంచి మీనం వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) ముఖ్యమైన పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేదు. పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. విద్యార్థులు పురోగతి చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో మం చి కాలక్షేపం చేస్తారు.
మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికమైన కాలక్షేపాలతో ప్రశాంతంగా గడిచి పోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలకు కొద్దిగా డబ్బు వెచ్చిస్తారు.
కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అదనపు పనులతో ఇబ్బంది పడతారు. వ్యాపారులకు, వృత్తులవారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు కష్ట మీదైనా విజయం సాధిస్తారు. కొన్ని నిర్ణయాలలో పెద్దల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.
సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన షేర్లకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కోపతాపాలకు ఇది సమయం కాదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.
కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఎంతో నిగ్రహంతో వ్యవహరించాలి. అనుకోని సమస్య లు మీద పడతాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువవుతుంది. బాగా పరిచయస్థులు మోసగించే అవకాశం ఉంది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంలో చేరతారు. వివాహ ప్రయత్నాలు విసిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వ్యాపారులు, స్వయం ఉపాధివారికి మాత్రమే కొద్దిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు బాగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన సమాచారం అందుతుంది.
ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తువులు కొంటారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలిస్తుంది. మానసిక ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల మార్పుల చోటు చేసుకుంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధ తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త పరిచయాలకు అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆందోళనకరమైన కబుర్లు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదే వీలు పెట్టుకోవద్దు.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి సమయం పట్టొచ్చు. ఆధ్యాత్మిక, కళా సాహిత్య రంగాలలో వారికి తప్ప, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు, వృత్తులవారికి సమయం అనుకూలంగా లేదనే చెప్పాలి. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.