• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE ON 14 5 2021 TELUGU ASTROLOGY PREDICTIONS TODAY THESE ZODIAC SIGNS WILL GET GOOD NEWS SK

Horoscope Today: మే 14 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్త వింటారు

Horoscope Today: మే 14 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్త వింటారు

ప్రతీకాత్మక చిత్రం

Horoscope: మే 14 (శుక్రవారం) రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు.. మొత్తం 12 రాశుల వారికి నేడు ఎలా ఉందో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

  • Share this:
    కాలజ్ఞానం

    దినఫలాలు

    మే 14, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా, సహోద్యోగుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొంటారు. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త.



    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    చిన్న వ్యాపారులకు అనుకూంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు కుదర్చుకుంటారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.



    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార లభాలు ఆర్జించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఒక బంధువు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సప్తమంలో శని సంచరిస్తున్నందు వల్ల తిప్పట ఎక్కువగా ఉంటుంది. అయితే, సమయం మీకు అనుకూలంగా ఉంది. కుమారుడికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. చాలా వరకు అప్పులు తీరుస్తారు.



    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    వ్యాపారానికి సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగానికి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.



    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. రాజకీయంగా పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి.  పాత స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యాల విషయంలో చర్చిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.



    తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. పాత ఇల్లు అమ్మి కొత్త ఫ్లాట్‌ కొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంది.



    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ప్రశంసలు లభిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. తిప్పట ఉన్నా అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. సహాయం కోసం బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీగా ఉండవద్దు. ఫ్లాట్‌ కొనే ఆలోచన చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.



    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఉద్యోగ వాతవరణం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు చాలావరకు తొలగుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.



    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారు శ్రమ మీద సత్పలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధ తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఎవరికీ హామీగా ఉండవద్దు. బంధువర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదరవచ్చు. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    మొత్తం మీద ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.
    Published by:Shiva Kumar Addula
    First published: