Home /News /astrology /

HOROSCOPE JANUARY 1ST 2022 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR 12 ZODIAC SIGNS PJC GH SK

Horoscope Today: ఈ రాశుల వారు జాగ్రత్త.. కొత్త ఏడాది తొలి రోజే కష్టాలు.. జనవరి 1 రాశి ఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today. ఇవాళ జనవరి 1. అందరూ ఎన్నో ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మరి 2022 తొలి రోజు.. రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
(పూజ చంద్ర, జ్యోతిష్య నిపుణులు )

ఈ రోజు అంటే అంటే 2022, జనవరి 1 శనివారం నాడు నూతన సంవత్సరం  (New Year) ప్రారంభం అయింది. జ్యోతిషశాస్త్రం  (Astrology)ప్రకారం ఈ రోజు కొన్ని రాశుల వారికి ఎంతో శుభకరంగా ఉంటుంది. ఇదే రోజున కొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజు రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
కొత్త సంవత్సరంలో మొదటిరోజున శక్తులన్నీ మిళితమవుతాయి. మీ మనస్సు గత సంఘటనలను అధికంగా స్మరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీ పరిసరాలు మిమ్మల్ని సహేతుకంగా ఉంచుతాయి. అందువల్ల ఈ రోజు మీ మనస్సు మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేసినా.. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీరు మీ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

లక్కీసైన్ - ఎరుపు చుక్క

వృషభం (Taurus) : ఏప్రిల్ 20-మే20
మీకు ఈ రోజంతా చాలా సంతోషకరంగా, ఉజ్వలంగా ఉంటుందని ఆకాశం సంకేతాన్ని ఇస్తుంది. మీరు మీ పనులపై మీ మనసును కేంద్రీకరించగలరు. మీరు మీ అన్ని భావాలను వ్యక్తీకరించి సంతృప్తి పొందేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ సైన్ - పెద్ద తెల్ల రాయి

ఈ 5 రాశులకు చెందిన తల్లులు.. చాలా ఎమోషనల్..

మిథునరాశి (Gemini) : మే 21- జూన్ 21
మీరు మీకు మంచి జరుగుతుందని మీరు ఆశాజనకంగా ఉన్నట్లయితే.. ఈ రోజున మంచి అనేది కచ్చితంగా జరుగుతుంది. ఈరోజు మీ లోలోపల పెరిగిపోతున్న భయాలను తొలగించండి. ఎందుకంటే అవి మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మిమ్మల్ని సహాయం చేయాలంటూ ఒక ఫ్రెండ్ అడిగే అవకాశం ఉంది.

లక్కీ సైన్- వైలెట్ పువ్వు

కర్కాటకం (Cancer): జూన్ 22- జూలై 22
మీరు చాలా ఉద్వేగానికి లోనైనట్లయితే.. అది మీ రోజును కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది. ఇలాంటప్పుడు పాత రోజుల్లో జరిగిన మంచి సంఘటనను గుర్తు తెచ్చుకోండి. తద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. మీ పనిలో మీకు మంచి అవకాశం ఈరోజు రావచ్చు. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు.

లక్కీ సైన్ - గాలిపటం

సింహం (Leo): జూలై 23- ఆగస్టు 22
ఈ సంవత్సరం రోజు మొదటిరోజు హఫ్ డే వరకు డల్‌గా ఉంటుంది. కానీ మిగిలిన రోజులో చాలా చేయాల్సిన చాలా పనులు మీ ముందుకు వస్తాయి. మీరు ఇప్పటివరకు చేసిన కృషి.. ఈరోజు ఫలప్రదం అవుతుంది.

లక్కీ సైన్- అందమైన సూర్యాస్తమయం

కన్య (Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22
ఇప్పటి వరకు ప్రజలు మీకు చేసిన మంచి పనులను గుర్తుంచుకుని తిరిగి మీరు వారికి మంచి చేయాల్సిన సమయం ఇది. ఈ రోజు చక్కటి సర్ ప్రైజెస్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచవచ్చు. విపరీతమైన సిచువేషన్ లలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించటం మంచిది.

లక్కీ సైన్- చేదు రుచి

విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

తుల (Libra) : సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
ఈరోజు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రలోభాలకు డోన్ కాకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఈ రోజు మీలో సోమరితనం పెరిగేలా చేస్తుంది. కొద్దిగా పుష్ దొరికితే చాలా మీరు ప్లాన్ ప్రకారం ఈ రోజున గొప్పగా గడుపుతారు. మీరు మీ ప్రియమైన వారికి ఇచ్చిన మీ వాగ్దానాలను నెరవేర్చండి. హామీ చేసిన డబ్బు ఈరోజు మీకు చేరవచ్చు.

లక్కీ సైన్ - నక్షత్ర ఆకారం

వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
గందరగోళ పరిస్థితులతో మిమ్మల్ని సతమతమయ్యేలా చేసిన గత కొన్ని ప్రజలతో పోల్చితే ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. మీ తోబుట్టువుల మీ పట్ల స్వచ్ఛమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు కొత్త అవకాశాల గురించి వింటారు.

లక్కీ సైన్ - పాత నాణెం

ఈ 5 వస్తువులు వంటగదిలో పెడితే.. సుఖ:సంతోషాలు కరువవుతాయి..

ధనుస్సు (Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
అపరాధ భావంతో కుమిలిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే విషయాల పట్ల పూర్తి స్పష్టతతో ఉండండి. చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఏదైనా ప్రీతికరమైన ఆహారాలను ఆస్వాదించండి. మీరు టైం మేనేజ్‌మెంట్‌ సాధన చేయవలసిన సమయం ఇది. పాత క్రష్ లేదా మాజీ భాగస్వామ్యులు మళ్లీ మీతో బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్- మెరుస్తున్న వీధిలైట్

మకరం (Capricorn) : డిసెంబర్ 22 - జనవరి 19
మీరు ఒక స్పెషల్ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. ఈ రోజు మీకు స్పెషల్ పర్సన్ పరిచయం కావచ్చు. తేలికపాటి చికాకు వల్ల కొంత సమయం అనవసరంగా వృధా కావచ్చు. మీరు రోజు చివరిలో క్రియేటివ్ ఫీలింగ్ కూడా అనుభవించవచ్చు. ఈరోజు మెలోడీ మ్యూజిక్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచొచ్చు.

లక్కీ సైన్- ఆకుపచ్చ కండువా

కుంభం (Aquarius): జనవరి 20- ఫిబ్రవరి 18
పెద్దల నుంచి ముఖ్యంగా తండ్రి లాంటి వ్యక్తి ఇచ్చే మంచి సలహా తీసుకుంటే మంచి జరుగుతుంది. ఈరోజు మీరు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. అలా చక్కటి బ్రేక్ పొందొచ్చు. మీరు మీ రహస్యాలను నమ్మదగిన స్నేహితుడితో పంచుకోవాలని భావిస్తారు. కానీ అది సరైన పని కాదా అనే సందిగ్ధతలో ఉంటారు.

లక్కీ సైన్ - ఆరు సున్నాలు

2022లో వివాహాలకు అద్భుతమైన ముహూర్తాలను వెల్లడించిన జోతిష్యులు..

మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
కొత్తగా బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు అపార్థాలను వెంటనే తొలగించుకోవాలి. ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - ఒక మెరుస్తున్న నక్షత్రం
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi fal, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు