Horoscope today 11 september: నేటి రాశిఫలాలు.. ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఏ రాశుల వారు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఫలాలు ఎవరికి దక్కుతాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

 • Share this:
  Horoscope today: రాశి ఫలాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఒక్కో రోజున కొన్ని రాశుల వారికి కలిసొస్తుంటే... మరికొందరికి సమస్యలు ఉంటున్నాయి. రాశిఫలాలు తెలుసుకోవడం ద్వారా... ఆ రోజు జరగబోయే, ఎదురవ్వబోయే సమస్యలపై ముందుగానే అలర్ట్ అవ్వొచ్చు. గ్రహాలు, తిథులు, కాలం, నక్షత్రాలు అన్నీ లెక్కలోకి తీసుకొని నేడు జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు చెబుతున్నారో చూద్దాం.

  మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మక చింతన పెరుగుతుంది. ఆదాయం పర్వాలేదు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుబసభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజసేవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  అతి ప్రయత్నం మీద బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పర్వాలేదు కానీ ఖర్చులు పెరుగుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  కన్య( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది అవసరాలు తీరతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆస్తి విషయంలో సమీప బంధువులు బాగా ఇబ్బంది పెడతారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
  ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

  ధనస్సు(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకబడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
  ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులుకూడా అందుకు దీటుగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

  కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలుపెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కొన్ని కుటుంబ బాధ్యతలను సమర్థంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
  Published by:Sumanth Kanukula
  First published: