Home /News /astrology /

HOROSCOPE HERE IS THE ASTROLOGY PREDICTIONS AND RASI PHALALU THESE ZODIAC SIGNS WILL GET JOB SK

Horoscope Today: జూన్ 10 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి మంచి ఉద్యోగం వస్తుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rasi phalalu today: జూన్ 10 రాశి ఫలాలు. ఇవాళ ఏ రాశుల వారికి ఎలా ఉంది? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష పండితు సూచనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం

    దినఫలం

    జూన్‌ 10, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    చాలాకాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిషారం అవుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దగ్గర బంధువొకరికి సహాయపడతారు. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయ పరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది.

    వృషభం (కృత్తిక 2, 3,రోహిణి, మృగశిర 1, 2)

    మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఖర్చుతో కూడుకున్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కార అవుతుంది. మిత్రుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు.

    మిథునం (మృగశిర 8, ఆర్ధ, పునర్వసు 1, 2, 3)

    రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ధోకా లేదు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వైద్యపరమైన ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడికి గురవుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

    కర్కాటకం (పునర్వసు, పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది, వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    వ్యక్తిత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగువారితో వాదాలకు, పేచీలకు దిగవద్దు.

    కన్య (ఉత్తర 2, 8, 4, హస్త, చిత్త 1, 2)

    పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి

    తుల (చిత్త 3, స్వాతి, విశాఖ 1, 2, 8)

    ఉద్యోగంలో మీ సూచనలకు, ఆలోచనలకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందిపడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    వృశ్చిక (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

    అనుకున్నదొకటి, అయింది ఒకటీ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌పెండింగ్‌లో పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడదేవారుంటారు. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    ధనుస్సు (మూల, పూర్వాషాధ, ఉత్తరాషాధ 1)

    నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ వస్తుంది. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. స్పెక్యులేషన్‌తో నష్టపోతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం.

    మకరం (ఉత్తరాషాఢ 2, 8, శ్రవణం, ధనిష్ట 1, 2)

    ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరత్రా సంపాదన కోసం సన్నిహితులతో చర్చిస్తారు. వ్యాపారం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభం (ధనిష్ట 8, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 8)

    వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    మీనం (పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి)

    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే, వైద్య ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్మారం అవుతుంది. మిత్రులు మీకు చేదోడువాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు