Raasi Phalalu: ఆ మూడు రాశుల వారికి అదృష్టమే అదృష్టం... పట్టిందల్లా బంగారమే...

Astrology Predictions: ప్రస్తుతం 12 రాశుల్లో... మూడు రాశుల వారికి టైమ్ బాగుంది. మరి ఆ రాశులేవో... ఆ రాశుల వారికి ఎలా కలిసొస్తుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 18, 2020, 5:44 AM IST
Raasi Phalalu: ఆ మూడు రాశుల వారికి అదృష్టమే అదృష్టం... పట్టిందల్లా బంగారమే...
ఆ మూడు రాశుల వారికి అదృష్టమే అదృష్టం...
  • Share this:
Raasi Phalalu: గతంలో అయితే లంకె బిందె యోగమనో, లాటరీ యోగమనో అనేవాళ్లు. దేశ కాల పరిస్థితులను బట్టి జ్యోతిష ఫలితాల అన్వయాన్ని, అర్థాన్నీ మార్చి చెప్పాల్సి ఉంటుంది. వచ్చే నెల రోజుల కాలంలో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతోందని గ్రహచార అధ్యయనాన్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి ఈ రాశుల వారికి వచ్చే నెల రోజు కాలం అన్ని విధాలా అనుకూమయిన కాలం అని కచ్చితంగా చెప్పవచ్చు. అనేక విధాలుగా కలిసి వచ్చే కాలం. వారి వారి ప్రయత్నాలను బన్ని వారి అదృష్టం పండుతుంది. అంటే వాళ్లున్న రంగాలు, వారి వృత్తి, వారి ఉద్యోగాలు, వారి చదువును బట్టి అంతా ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రాశుల వారు చేయవలసిందల్లా ఒక చిన్న ప్రయత్నం చేయడమే. ఇంతకూ ఈ మూడు రాశులూ ఏవంటే... మేష, సింహ, ధనూ రాశి.

ఆ మూడు రాశుల వారికి అదృష్టమే అదృష్టం...


గ్రహ సంచారంలో గురు, శని, రాహు, కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇతర గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది కానీ, ఒక్కొక్క రాశిలో ఏడాదికి పైగా ఉండే ఈ నాలుగు గ్రహాల ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నాలుగు గ్రహాలు... ప్రస్తుతం స్వస్థానంలో ఉన్నాయి. నవంబర్‌ నెలాఖరు వరకు ధన, భాగ్య కారకుడైన గురువు స్వస్థానంలోనే ఉంటుంది. ఈ గ్రహ సంచారం వచ్చే నెలాఖరువరకు మేష, సింహ, ధనూ రాశి వారికి అనుకూలంగా, అదృష్టం తెచ్చి పెట్టేదిగా ఉంది. జాతక చక్రంలో గ్రహ స్థితి, దశాంతర్దశ పది శాతం అనుకూలంగా ఉన్నా ప్రస్తుత గ్రహచారం వంద శాతం అనుకూలిస్తుంది. గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తాయి? ఏ రకంగా అదృష్టం తెచ్చి పెడతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఆయా జాతక చక్రాలను బట్టి ఉంటుంది.

స్థూలంగా చెప్పాంటే... ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు పోవడం తప్ప, రావడం అంటూ లేని కాలంలో కూడా ఉద్యోగాల ఆఫర్లు వస్తాయి. విదేశాల నుంచి, బహుళ జాతి సంస్థ నుంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాని వివాహ ప్రయత్నాలు అనుకోకుండా, అనూహ్యంగా కుదిరిపోతాయి. సంతానం కోసం తపించిపోతున్నవారు సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ జరుగుతుంది. ఇల్లు కానీ, స్థలం గానీ కొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తులవుతారు. విద్యార్థులకు విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవరాలు ముందడుగు వేస్తాయి. తీర్థయాత్రకు వెళ్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆస్తి కలిసి వస్తుంది.

ఈ మూడు రాశుల వారికి ఇటువంటివన్నీ చాలావరకు జరిగే అవకాశం ఉంది. ఒక్కో రాశిలోనూ మూడు నక్షత్రాలు ఉంటాయి. ఈ మూడు నక్షత్రాల వారికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ధనస్సు వారితో పోలిస్తే మేష, సింహ రాశుల వారికి మరీ ఉత్తమంగా ఉందని చెప్పవచ్చు. నిజానికి ఈ మంచి కాలం ఏప్రిల్‌, మే నెల వరకూ కొనసాగే అవకాశం కూడా ఉంది. నవంబర్‌ నెలాఖరు నుంచి గురుగ్రహం స్వస్థానం వదిలి తనకు నీచ స్థానమైన మకరంలో ప్రవేశిస్తున్నప్పటికీ, శుభ పరిణామాలు మాత్రం కొనసాగే అవకాశం ఉంది.

ఈ మూడు రాశులకూ అన్నీ శుభాలే జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. ముఖ్యంగా తిప్పుట ఎక్కువగా ఉంటుంది. దగ్గరి బంధువు, స్నహితులు, నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉండడం వంటివి ఉండవచ్చు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ఈ మూడు రాశుల వారి అదృష్టానికి తిరుగుండదు. మీరు నమ్మిన దేవుడిని శ్రద్ధగా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండండి. అదృష్టాన్ని పండించుకోండి.
Published by: Krishna Kumar N
First published: October 18, 2020, 5:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading