HOROSCOPE 9 6 2021 ASTROLOGY SUGGESTS THAT THESE ZODIAC SIGNS MAY GET GOOD NEWS FROM THEIR JOBS CHECK RASI PHALALU HERE NK
Horoscope Today June 9, 2021: రాశి ఫలాలు... వీరు ఆర్థిక లక్ష్యాలు చేరుతారు... శ్రమ ఉంటుంది
Horoscope 9-6-2021: రాశి ఫలాలు
Horoscope today 9-6-2021: నేడు బుధవారం. సగం వారం పూర్తయ్యే రోజు. మరి ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. జ్యోతిష పండితులు ప్రత్యేకించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Horoscope 9-6-2021:రాశి ఫలాలకు సంబంధించి ఈ నెలలో బుధ గ్రహం ప్రభావం బాగా పడుతోంది. ఈ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. అన్ని గ్రహాలలోకీ చిన్న గ్రహం. భూమికి దగ్గరగా ఉండే శుక్రగ్రహం కంటే... బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ గ్రహం కారణంగా... కొన్ని రాశి ఫలాల వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అంటున్నారు. మరి ఇవాళ్టి రాశి ఫలాల్లో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న సమయం ఇది. ఇలాంటప్పుడు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏం చెబుతున్నారో నేటి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
పెండింగ్ పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఆటంకాలు, అవరోధాలు లేకుండా మీ పనులు పూర్తి చేసుకుంటారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. దగ్గరి బంధువులతో వాగ్వాదాలకు, విభేదాలకు అవకాశం ఉంది.
మిథున రాశి (Gemini)
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిదానంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే, వైద్యపరమైన ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి.
సింహ రాశి (Leo)
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి.
కన్య రాశి (Virgo)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబానికి, ఆదాయానికి సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
తుల రాశి (Libra)
ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది.
రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం ఒకటి పెండింగ్లో పడుతుంది. వృత్తి, వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగులకు, వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం.
మకర రాశి (Capricorn)
ఉద్యోగపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో ఊహించని సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది.
కుంభ రాశి (Aquarius)
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.
మీన రాశి (Pisces)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యల పరిష్కారంలో తొందరపడవద్దు. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.