Horoscope today 30-6-2021: ఈ రాశుల వారికి ఖర్చుల భారం... కంట్రోల్ తప్పొద్దు

Horoscope today 30-6-2021: రాశి ఫలాలు

Horoscope today 30-June-2021: ఈ రోజు బుధవారం. ప్రస్తుతం వివిధ రాశుల వారిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంది? వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రేమలు, పెళ్లిళ్లకు ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope 30-6-2021: ప్రతి రోజు న్యూస్18 తెలుగు రాశి ఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక, సామాజిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? తెలుగు పంచాంగం, తిథి, నక్షత్రాలు, గ్రహ బలాలు ఎలాంటి అంశాలను సూచిస్తున్నాయి? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటి అంశాలు తెలుసుకోవచ్చు. ఈ రోజు రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది.

    మేష రాశి (Aries)
    ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగంలో ఎవరి సహకారమూ లేకుండా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    మిథున రాశి (Gemini)
    ఈ రాశి వారికి ఉద్యోగం ఆనందంగా, ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. అవసరాలు తీరతాయి. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. శుభవార్త వింటారు.

    ఇది కూడా చదవండి: Vastu Tips: రోజూ నిద్ర లేచాక ఈ 10 వస్తువుల్ని చూడకండి... చూస్తే ఆ రోజంతా కష్టాలే!

    సింహ రాశి (Leo)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృ త్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

    కన్య రాశి (Virgo)
    ఈ రాశివారికి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నా విజయవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి పరిచయాలు అవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

    తుల రాశి (Libra)
    ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    ఇది కూడా చదవండి: Vastu Astrology: వైవాహిక జీవితంలో సమస్యలా?... వెంటనే ఇలా చెయ్యండి

    వృశ్చిక రాశి (Scorpio)
    ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఉద్యోగంలో అధికారుల అభినందనలు, ప్రశంసలు అందుకుంటారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలావరకు మెరుగుపడుతుంది. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృ త్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    మీన రాశి (Pisces)
    ఈ రాశివారికి ఖర్చులు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులు సాయంగా ఉంటారు. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: