Horoscope 29-6-2021: ఈ రాశుల వారు నేడు పెట్టుబడులు పెడితే అన్నీ నష్టాలే...

Horoscope 29-6-2021: నేటి రాశి ఫలాలు

Horoscope today 29-June-2021: మంగళవారం... మార్స్ గ్రహానిది. భూమికి పక్కనే ఉండటం వల్ల రాశులపై కుజ గ్రహం ప్రభావం చాలా ఎక్కువ. మరి ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • Share this:
    Horoscope 29-6-2021: దేశంలో పరిస్థితులు బాగోకపోయినా రాశి ఫలాలు మాత్రం కాస్తంత ధైర్యం ఇస్తున్నాయి. భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలను పెంచుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని చెబుతున్నాయి. గ్రహాలు, సూర్య గమనం, తిథి, కాలం, నక్షత్ర రాశులు, పాలపుంతలో భూమి ప్రయాణం వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని రాశిఫలాలు ఇస్తున్నారు జ్యోతిష పండితులు. మరి ఇవాళ ఎవరి రాశి ఎలా ఉంది? ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రేమలు, పెళ్లిళ్లకు ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. పిల్లల స్థితిగతులు బాగుంటాయి. ఇష్టమైన వారితో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభ రాశి (Taurus)
    వృషభ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి నిపుణులకు అన్నివిధాలా బాగుంది. తల పెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్తగా ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు.

    మిథున రాశి (Gemini)
    ఈ రాశి వారికి ఉద్యోగం ఆనందంగా, ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు పెరు గుతాయి. ఆరోగ్యం పరవాలేదు. అవసరాలు తీరతాయి. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

    కర్కాటక రాశి (Cancer)
    ఈ రాశివారు పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.

    సింహ రాశి (Leo)
    ఈ రాశిరి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. అందరితోనూ సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    కన్య రాశి (Virgo)
    ఈ రాశివారికి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నా విజయవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మీరు గుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి పరిచయాలు అవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

    తుల రాశి (Libra)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు సహాయంగా ఉంటారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్వయం ఉపాధిలో ఉన్నవారు కొద్దిగా పురోగతి సాధిస్తారు.

    ఇది కూడా చదవండి:Future Predictions: కరోనాను ముందే ఊహించా... భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...

    వృశ్చిక రాశి (Scorpio)
    ఈ రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు సాటి ఉద్యోగుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసు కోవద్దు. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాలు ఆశించినంతగా లాభించవు.

    మకర రాశి (Capricorn)
    ఈ రాశివారికి అన్నీ శుభఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది.

    కుంభ రాశి (Aquarius)
    ఈ రాశివారు కూడా ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏటుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం.

    మీన రాశి (Pisces)
    ఈ రాశివారికి ఖర్చులు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. అనుక ఎన్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులు సాయంగా ఉంటారు. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: